నటి హుమా ఖురేషి ప్రధాన పాత్ర పోషించిన ‘మహారాణి సీజన్ 4’కు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. ఈ సీజన్‌లోనూ ఆమె రాణి భారతిగా తిరిగి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పాలించి, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగే క్రమాన్ని చూపిస్తుంది. నవంబర్ 7న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ఈ షోపై.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన రివ్యూ ఇచ్చారు.
అరవింద్ కేజ్రీవాల్ రివ్యూ ఇలా..

మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్ కు మొదటి మూడు సీజన్లలాగే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ కొత్త సీజన్ మరింత ఉత్కంఠ రేపేలా ఉందని రివ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై రివ్యూ ఇచ్చారు.
కేజ్రీవాల్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఈ సిరీస్‌ను చూడాలని కోరారు. "మీరు తప్పక సోనీ లివ్ లో మహారాణి 4 వెబ్‌సిరీస్‌ని చూడాలి. ఇది నేటి రాజకీయాల వికృత వాస్తవాన్ని చూపిస్తుంది. ధైర్యం చూపినందుకు మొత్తం బృందానికి అభినందనలు" అని ట్వీట్ చేశారు.
మహారాణి సీజన్ 4 గురించి..
మహారాణి నుంచి ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. అన్నింటికీ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా చాలా ఉత్కంఠ రేపేలా సాగింది. ఈ ఫిక్షనల్ డ్రామా బీహార్‌లోని వాస్తవ సంఘటనల (ముఖ్యంగా 1990లలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని వారసురాలిగా నియమించిన సంఘటన) నుండి ప్రేరణ పొందింది.
'మహారాణి సీజన్ 4'లో రాణి భారతి ఒక కుంభకోణం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన కూతురు రోష్ని (శ్వేతా బసు ప్రసాద్)ని కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తుంది. ఇది బంధుప్రీతి ఆరోపణలకు దారి తీయడంతోపాటు ఆమె పెద్ద కొడుకుతో సహా పార్టీ సభ్యుల నుండి వ్యతిరేకత తీసుకొస్తుంది.
{{/usCountry}}'మహారాణి సీజన్ 4'లో రాణి భారతి ఒక కుంభకోణం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన కూతురు రోష్ని (శ్వేతా బసు ప్రసాద్)ని కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తుంది. ఇది బంధుప్రీతి ఆరోపణలకు దారి తీయడంతోపాటు ఆమె పెద్ద కొడుకుతో సహా పార్టీ సభ్యుల నుండి వ్యతిరేకత తీసుకొస్తుంది.
{{/usCountry}}ఈ కొత్త సీజన్ లో రాణికి అతి పెద్ద సమస్యగా ప్రధానమంత్రి (విపిన్ శర్మ) మారుతాడు. ఆమెను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రధాని ప్రయత్నించడం, ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటమే 'మహారాణి సీజన్ 4' ప్రధాన కథాంశం. ఈ సిరీస్ క్రియేటర్ సుభాష్ కపూర్. ఈ సీజన్‌ను సుభాష్ కపూర్, నందన్ సింగ్, ఉమాశంకర్ సింగ్ రాశారు.