Shalini Pandey Topless Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తర్వాత చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'డీప్‌ఫేక్' (Deepfake) వీడియోలు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి బాధితులుగా మారగా, తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని పాండే కూడా దీని బారిన పడ్డారు.

తన రూపాన్ని మార్ఫ్ చేస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక నకిలీ ఏఐ వీడియోపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సదరు నకిలీ వీడియోను ఎవరూ షేర్, డౌన్‌లోడ్ చేయకుండా, వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమానులకు, నెటిజన్లకు పిలుపునిచ్చారు.
'అది నన్ను తీవ్రంగా కలచివేసింది'.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన
సదరు వైరల్ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన షాలిని పాండే ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "ఇటీవల నా పేరుతో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న నకిలీ ఏఐ వీడియో గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వీడియో పూర్తిగా కల్పితమైనది. అందులో ఉన్నది ఎంతమాత్రం నేను కాదు. వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
షేర్ చేయకండి.. వెంటనే రిపోర్ట్ చేయండి
ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, దీనిని సాధారణ విషయంగా చూడకూడదని షాలిని పిలుపునిచ్చారు. "మీకు కనుక ఆ వీడియో కనిపిస్తే దయచేసి ఎవరికీ షేర్ చేయవద్దు. డౌన్‌లోడ్ లేదా ఫార్వర్డ్ చేయవద్దు. వెంటనే ఆ వీడియోపై రిపోర్ట్ చేయండి. ఆ వీడియో వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను" అని ఆమె వీక్షకులకు విజ్ఞప్తి చేశారు.
పెరిగిపోతున్న 'డీప్‌ఫేక్' ముప్పు.. హెచ్చరించిన ప్రముఖులు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డీప్‌ఫేక్ వీడియోలకు బలైన వారిలో షాలిని పాండే మొదటివారేమీ కాదు. గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.
{{/usCountry}}భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డీప్‌ఫేక్ వీడియోలకు బలైన వారిలో షాలిని పాండే మొదటివారేమీ కాదు. గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.
{{/usCountry}}ఇటీవలే నటి మృణాల్ ఠాకూర్ కూడా తన ఏఐ వీడియోలపై తీవ్రంగా మండిపడుతూ, తన అనుమతి లేకుండా రూపాన్ని దుర్వినియోగం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం గమనార్హం.
షాలిని పాండే కెరీర్ ఇలా..
2017లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో షాలిని పాండే సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రీతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత 'మహానటి', హిందీలో రణ్‌వీర్ సింగ్ సరసన 'జయేశ్‌భాయ్ జోర్దార్', నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘మహారాజ్’లలో మెరిశారు. గతేడాది తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’, 'డబ్బా కార్టెల్' షోల ద్వారా అలరించిన షాలిని.. ప్రస్తుతం పలు కీలక ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.