Arjun Sarja: హీరో దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. సినీ రంగం నుంచి వచ్చి సీఎం కుర్చీపై కూర్చున్నారు. తాజాగా దళపతి విజయ్ పై, సీఎం కుర్చీ చూడగానే అతనికి వచ్చిన ఆలోచనల గురించి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సంచలన కామెంట్లు చేశాడు. తన ‘ఒకే ఒక్కడు’ మూవీ పేరును ప్రస్తావించాడు.
ఒకే ఒక్కడు మూవీ

"నేను ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ ను కలిసినప్పుడు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో 'ఒకే ఒక్కడు' సినిమాకు సంబంధించి వస్తున్న మీమ్స్, రీల్స్ అన్నింటినీ చూశానని చెప్పారు. అంతేకాదు, తాను మొదటిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, ఆ సీటును చూసి తనకు 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చిందని విజయ్ నాతో పంచుకున్నారు" అని అర్జున్ సర్జా తెలిపాడు.
ఎంతో గర్వంగా
సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తి అత్యున్నత రాజకీయ శిఖరానికి చేరుకోవడం ఎంతో గర్వంగా ఉందని అర్జున్ అన్నాడు. "విజయ్ ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన మన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి’’ అని అర్జున్ తెలిపాడు.
లియోలో కలిసి
‘‘ఫస్ట్ ఎన్నికల్లోనే పోటీ చేసి, ఇంతటి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం సాధారణ విషయం కాదు. అది ఒక అద్భుతమైన విజయం. మన సినిమా పరిశ్రమ నుంచి ఒకరు అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు మనందరికీ ఆనందంగా ఉంటుంది" అని అర్జున్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమాలో అర్జున్, విజయ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో సంచలనం
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'ఒకే ఒక్కడు' (తమిళంలో ముదల్వన్) భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఒక సాధారణ టీవీ రిపోర్టర్ ఒక రోజు ముఖ్యమంత్రిగా మారి ఎలాంటి మార్పులు తెచ్చాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికీ రాజకీయాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
{{/usCountry}}దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'ఒకే ఒక్కడు' (తమిళంలో ముదల్వన్) భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఒక సాధారణ టీవీ రిపోర్టర్ ఒక రోజు ముఖ్యమంత్రిగా మారి ఎలాంటి మార్పులు తెచ్చాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికీ రాజకీయాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
{{/usCountry}}ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఘనవిజయం సాధించింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో, విజయ్ నిజజీవిత రాజకీయ ప్రస్థానానికి, 'ఒకే ఒక్కడు' చిత్రానికి మధ్య ఉన్న పోలికలపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి.
బ్లాస్ట్ జోన్ తో
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 'మా పల్లెలో గోపాలుడు' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను.. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్' (తమిళంలో 'బ్లాస్ట్') మే 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన అర్జున్.. మీడియాతో ముచ్చటించాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: అర్జున్ సర్జా నటించిన 'బ్లాస్ట్ జోన్' సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?
జవాబు: అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్' మే 28, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ప్రశ్న: ముఖ్యమంత్రి విజయ్ గురించి అర్జున్ సర్జా ఏమన్నారు?
జవాబు: సినీ పరిశ్రమకు చెందిన విజయ్ మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి కావడం పట్ల అర్జున్ గర్వంగా ఉందన్నారు. విజయ్ మొదటిసారి సీఎం కుర్చీ చూసినప్పుడు అర్జున్ నటించిన 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చిందని తనకు చెప్పినట్లు వెల్లడించారు.
ప్రశ్న: 'బ్లాస్ట్ జోన్' సినిమా ప్రత్యేకత ఏమిటి?
జవాబు: ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పూర్తిస్థాయి కరాటే ఎక్స్‌పర్ట్ (కరాటే మాస్టర్) పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే, దాదాపు 26 ఏళ్ల తర్వాత నటి అభిరామితో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.