...
...
Next Story

OTT Horror: బీ రెడీ- వణికించేందుకు వచ్చేస్తున్న మలయాళం హారర్ థ్రిల్లర్- ఒకేసారి 6 ఓటీటీల్లోకి- గుండె ధైర్యం ఉన్నవాళ్లకే!

OTT Horror: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన డిఫరెంట్ పీరియాడిక్ అండ్ మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అరూపి’. ఈ సినిమా డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమైంది. ఒకేసారి ఏకంగా 6 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Aug 12, 2026, 13:53:03 IST
Advertisement

OTT Horror: మలయాళం హారర్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ వీక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూలై 3న థియేటర్లలో విడుదలై విమర్శకులు, సినీ ప్రియుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న సరికొత్త మలయాళ చిత్రం ‘అరూపి’ (Aroopi). థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

అరూపి ఓటీటీ రిలీజ్ డేట్

బీ రెడీ- వణికించేందుకు వచ్చేస్తున్న మలయాళం హారర్ థ్రిల్లర్- ఒకేసారి 6 ఓటీటీల్లోకి- గుండె ధైర్యం ఉన్నవాళ్లకే!
బీ రెడీ- వణికించేందుకు వచ్చేస్తున్న మలయాళం హారర్ థ్రిల్లర్- ఒకేసారి 6 ఓటీటీల్లోకి- గుండె ధైర్యం ఉన్నవాళ్లకే!

మలయాళం హారర్ థ్రిల్లర్ అరూపి ఆగస్టు 14, 2026 నుంచి డిజిటల్ వేదికలపై అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. భారతదేశంలో ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్, ఎపి ఇంటర్నేషనల్, ఆహా తమిళం ప్లాట్‌ఫామ్‌లలో ఈ మూవీ విడుదలవుతుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు సింప్లీ సౌత్ (Simply South) వేదికగా అందుబాటులోకి రానుంది.

పురాతన శాపం.. పద్మిని దెయ్యం కథేంటి?

‘అరూపి’ చిత్రం కేవలం రొటీన్ భయానక దృశ్యాలతో కాకుండా, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలతో నిండిన మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది. వందల ఏళ్ల క్రితం 'ఆర్యనాట్టు' అనే పురాతన రాజవంశం 'పద్మిని' అనే పగబట్టిన యక్షిణి ఆత్మను ఒక చెక్క బొమ్మలో బంధించి సీల్ వేస్తారు. ఆ బొమ్మను ఎవరూ తాకకుండా తరతరాలుగా జాగ్రత్త పడతారు.

ఇద్దరు దొంగలు

కాలక్రమేణా మారుతున్న రోజుల్లో ఇద్దరు దొంగలు ఆ ఆర్యనాట్టు పురాతన బంగ్లాలోకి వెళ్తారు. ఆ పురాతన బొమ్మను దొంగిలించే క్రమంలో దాన్ని విరగ్గొడతారు. దాంతో శతాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న పద్మిని ఆత్మ విముక్తి పొంది, ఆ పరిసరాల్లో క్రూరమైన హత్యలకు ఒడిగడుతుంది.

అసలైన ట్విస్ట్

పునర్థమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రదీప్ రాజ్ నిర్మించిన ఈ అరూపి చిత్రానికి అభిలాష్ వారియర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు. వైశాఖ్ రవి, బాలీవుడ్ నటి నేహా చావ్లా ప్రధాన పాత్రల్లో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా నటించగా.. సాక్షి భదాలా, జాయ్ మాథ్యూ, సింధు వర్మ, అభినవ్ వారియర్, కిరణ్ రాజ్, ఆదిత్య రాజ్ ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు.

పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ (Gopi Sundar) ఈ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ లవర్స్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అమల్ సినిమాటోగ్రఫీ, వి.టి. వినీత్ ఎడిటింగ్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి.

హారర్, సస్పెన్స్, సైకలాజికల్ డ్రామా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ ఆగస్టు 14న ఓటీటీలో ‘అరూపి’ ఒక బెస్ట్ వాచ్ ఆప్షన్‌గా నిలవనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe