...
...
Next Story

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయిన బాలీవుడ్ నటుడు.. పబ్లిగ్గా జోకులేయడమే మానేశాడట.. అసలేం జరిగిందంటే?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ దిమ్మదిరిగిపోయిందట. రెండేళ్ల కిందట రేగిన ఆ వివాదం తర్వాత తాను పబ్లిగ్గా జోకులేయడమే మానేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు వెల్లడించాడు.

Published on: Jul 7, 2026, 16:44:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prabhas: రెండేళ్ల కిందట కల్కి 2898 ఏడీ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను చూసి 'జోకర్' లా ఉన్నాడంటూ నోరు జారిన బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ ఎట్టకేలకు సైలెంట్ అయిపోయాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఊహించని రేంజ్ ట్రోలింగ్, టాలీవుడ్ హీరోల నుంచి ఎదురైన కౌంటర్ల దెబ్బకు తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి ముందూ నోరు విప్పాలంటేనే భయమేస్తోందని క్లారిటీ ఇచ్చాడు.

ఆ పని చేయడమే మానేశాను: అర్షద్ వార్సీ

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయిన బాలీవుడ్ నటుడు.. పబ్లిగ్గా జోకులేయడమే మానేశాడట.. అసలేం జరిగిందంటే?
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయిన బాలీవుడ్ నటుడు.. పబ్లిగ్గా జోకులేయడమే మానేశాడట.. అసలేం జరిగిందంటే?

కల్కి 2898 ఏడీ వివాదం తర్వాత తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి న్యూస్ 18 కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ ఓపెన్ అయ్యాడు.

"ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ తో నా మీద నేను 'సెల్ఫ్ సెన్సార్ షిప్' విధించుకున్నాను. ఇప్పుడు కేవలం నాకు బాగా తెలిసిన వాళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే జోక్స్ వేస్తున్నాను. తెలియని వాళ్ల ముందు అసలు నోరు విప్పడమే మానేశాను" అని చెప్పుకొచ్చాడు. అయితే జనాలు కూడా చిన్న చిన్న జోక్స్ ను కొంచెం లైట్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని చురక అంటించాడు.

అలాంటి జోక్స్ నచ్చవు

అలాగే తనకు పాకిస్తానీ హ్యూమర్, అడల్ట్ కామెడీలు అస్సలు నచ్చవని అర్షద్ కరాఖండిగా చెప్పేశాడు. "పాకిస్తానీ జోక్స్ ఎప్పుడూ ఇతరులను కించపరిచేలా ఉంటాయి. నాకైతే వాటి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, అదంతా వాళ్ల కల్చర్" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా సెల్ఫ్ సెన్సార్ అలవాటు చేసుకుని ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బందులు రావని ఫీల్ అవుతున్నాడు.

అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే..

"ప్రభాస్ క్యారెక్టర్ చూసి నేను నిజంగా బాధపడ్డాను. మ్యాడ్ మ్యాక్స్ లో మెల్ గిబ్సన్ లా ఊహించుకుంటే, అతన్ని ఒక జోకర్ లాగా మార్చేశారు" అంటూ అప్పట్లో సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

అర్షద్ వార్సీపై ప్రభాస్ ఫ్యాన్స్ అటాక్

ఆ ఒక్క మాటతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ ను ఒక ఆట ఆడుకున్నారు. అదే టైమ్ లో 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని సైతం.. "అతని లైఫ్ లో ఇదే బిగ్గెస్ట్ పబ్లిసిటీ" అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం చాలా కూల్ గా స్పందిస్తూ.. "అర్షద్ సార్ తన పదాలు కొంచెం జాగ్రత్తగా వాడి ఉంటే బాగుండేది. కానీ కల్కి 2 లో ప్రభాస్ బెస్ట్ అవతార్ చూపిస్తా" అంటూ అర్షద్ పిల్లలకు ఏకంగా బుజ్జి టాయ్స్ పంపించాడు. ఈ ఇష్యూ చాలా దూరం వెళ్లడంతో, నాని కూడా తన రియాక్షన్ పై తర్వాత కొంచెం ఫీల్ అయ్యాడు.

ఎవరి కెరీర్ ఎలా?

ప్రస్తుతం ప్రభాస్, అర్షద్ ఇద్దరూ తమ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా 'వెల్కమ్ టు ది జంగిల్' తో అలరించిన అర్షద్ చేతిలో ఇప్పుడు 'ధమాల్ 4', 'గోల్‌మాల్ 5', షారుఖ్ ఖాన్ 'కింగ్' లాంటి భారీ సీక్వెల్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

అటు డార్లింగ్ ప్రభాస్ 'ది రాజా సాబ్' తో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన తర్వాత ఇప్పుడు పూర్తి యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ లైనప్ తో మోత మోగించడానికి రెడీ అవుతున్నాడు. అతని చేతిలో స్పిరిట్, ఫౌజీ, కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ లాంటి సినిమాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe