Aspirants Season 3 Trailer: అభిలాష్ వర్సెస్ సందీప్ భయ్యా.. ఆస్పిరెంట్స్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఆ రోజే

Aspirants Season 3 Trailer: అమెజాన్ ప్రైమ్ వీడియో మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ లలో ఒకటైన ఆస్పిరెంట్స్ కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా శుక్రవారం (మార్చి 6) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Mar 6, 2026, 17:33:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లక్షలాది మంది యూపీఎస్సీ (UPSC) ఆస్పిరెంట్లను అలరించిన టీవీఎఫ్ (TVF) మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్' (Aspirants) మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈసారి కథ కేవలం ఐఏఎస్ అధికారుల బాధ్యతల చుట్టూనే కాకుండా, పాత స్నేహితుల మధ్య తలెత్తిన తీవ్రమైన విభేదాలు, ఈగో క్లాషెస్ చుట్టూ తిరుగుతోంది.

Aspirants Season 3 Trailer: అభిలాష్ వర్సెస్ సందీప్ భయ్యా.. ఆస్పిరెంట్స్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఆ రోజే
Aspirants Season 3 Trailer: అభిలాష్ వర్సెస్ సందీప్ భయ్యా.. ఆస్పిరెంట్స్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఆ రోజే

కోర్టు మెట్లెక్కిన అభిలాష్ - సందీప్ భయ్యా స్నేహం

ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ట్రైలర్ ప్రకారం.. నవీన్ కస్తూరియా పోషిస్తున్న అభిలాష్, సన్నీ హిందూజా పాత్ర సందీప్ భయ్యా మధ్య వైరం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా వీరిద్దరూ కోర్టు కేసుల వరకు వెళ్లడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.

"హిందీ మీడియం"లో చదివిన వారితో పోల్చుకుంటూ అభిలాష్ చేసిన "ఇంగ్లీష్ మీడియం" వ్యాఖ్యలు కొత్త శత్రువులను తయారు చేశాయి. ఒకప్పుడు గురువులా భావించిన సందీప్ భయ్యాయే ఇప్పుడు అభిలాష్‌కు ఎదురు నిలబడటం ఈ సీజన్ లో ప్రధాన ఆకర్షణ.

అభిలాష్ ప్రయాణంపై నవీన్ కస్తూరియా మాటల్లో..

తమ పాత్ర గురించి నవీన్ మాట్లాడుతూ.. మూడో సీజన్ లో అభిలాష్ ప్రయాణం మరింత సంక్లిష్టంగా ఉంటుందని చెప్పాడు. "కాగితం మీద అతని కల నిజమైనట్లు కనిపిస్తుంది కానీ గ్రౌండ్ లో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ప్రజల అంచనాలు, వ్యక్తిగత గిల్ట్, తనను నమ్మిన వారిని నిరాశపరుస్తాననే భయం మధ్య అతను కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సీజన్‌లో అభిలాష్ మరింత సున్నితంగా, తన లోపాలను నిజాయితీగా అంగీకరించే వ్యక్తిగా కనిపిస్తాడు" అని వివరించాడు.

సందీప్ భయ్యా ఏమంటున్నారంటే?

తన పాత్ర పరిణామం గురించి సన్నీ హిందూజా స్పందిస్తూ.. "అధికారం, దూరం, పరిస్థితులు మారినప్పుడు స్నేహాలు, ఆశయాలు ఎలా పరీక్షించబడతాయో సీజన్ 3 చూపిస్తుంది. తన శిష్యులు తీసుకునే కొన్ని నిర్ణయాలను సందీప్ భయ్యా అంగీకరించలేకపోతాడు. ఒత్తిడిలో సంబంధాలు ఎలా రూపాంతరం చెందుతాయనేది ఆసక్తికరంగా ఉంటుంది" అని తెలిపాడు.

ఆస్పిరెంట్స్ సీజన్ 3 విశేషాలు

ఆస్పిరెంట్స్ తొలి సీజన్ ఐఏఎస్ కలలు కనే ముగ్గురు స్నేహితులు, వాళ్లను గైడ్ చేసే మరో సీనియర్ చుట్టూ తిరిగింది. రెండో సీజన్ లో ఆ ముగ్గురిలో ఒకరు ఐఆర్ఎస్ సాధించడం, తనను గైడ్ చేసిన సీనియర్ మాత్రం రాష్ట్ర స్థాయి ఉద్యోగం సెటిలైపోవడం చూడొచ్చు. ఈ క్రమంలోనే అభిలాష్, సందీప్ భయ్యా మధ్య విభేదాలు తలెత్తుతాయి.

మూడో సీజన్లో వీళ్ల మధ్య ఫైట్ మరో లెవెల్ కు చేరినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూడో సీజన్ లోనూ నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా, శివంఖిత్ సింగ్ పరిహార్, అభిలాష్ థాప్లియాల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్పిరెంట్స్ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More