Avengers Dooms Day Trailer: ఒకే చోట మార్వెల్ సూపర్ హీరోలు-నెక్స్ట్ లెవల్ లో అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్-పూనకాలే!

Avengers Dooms Day Trailer: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ భారీ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ఫైనల్ ట్రైలర్ విడుదలై ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఐరన్ మ్యాన్‌గా అలరించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి భయంకరమైన విలన్ డాక్టర్ డూమ్‌గా వణుకు పుట్టిస్తున్నాడు.

Published on: Nov 24, 2026, 08:58:50 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Avengers Dooms Day Trailer: ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తర్వాత వస్తున్న మార్వెల్ మూవీ ‘అవెంజర్స్ డూమ్స్ డే’. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లేలా దర్శకులు ఆంథోనీ రుస్సో, జో రుస్సో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ తాజాగా రిలీజైంది.

ఒకే చోట మార్వెల్ సూపర్ హీరోలు-నెక్ట్స్ లెవల్ లో అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్-పూనకాలే! (x/MarvelStudios)
ఒకే చోట మార్వెల్ సూపర్ హీరోలు-నెక్ట్స్ లెవల్ లో అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్-పూనకాలే! (x/MarvelStudios)

అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్

ఈ ఫైనల్ ట్రైలర్ అవెంజర్స్ డూమ్స్ డేపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో సాగిన ఈ ట్రైలర్, కథలోని అసలు సస్పెన్స్‌ను దాచిపెడుతూనే ఎమోషన్, యాక్షన్ రెండింటినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేసింది.

స్టీవ్ రోజర్స్ ఎమోషనల్ కమ్‌బ్యాక్

అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను కట్టిపడేసే ప్రధాన అంశం స్టీవ్ రోజర్స్ (క్రిస్ ఎవాన్స్) రీఎంట్రీ. ఎండ్‌గేమ్ తర్వాత గతంలోకి వెళ్లి పెగ్గీ కార్టర్ (హేలీ అట్వెల్)తో ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్న స్టీవ్, తన కొడుకు స్టీవెన్ గ్రాంట్ రోజర్స్‌కు అవెంజర్స్ గురించి చెబుతున్న సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది.

అప్పట్లో ప్రపంచాన్ని కాపాడటానికి తాము తీసుకున్న నిర్ణయాలకు ఊహించని పరిణామాలు ఉంటాయని అప్పుడు తెలియదంటూ స్టీవ్ చెప్పే డైలాగ్ కథలోని అసలు సంఘర్షణను సూచిస్తోంది. మల్టీవర్స్‌కు పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఫెంటాస్టిక్ ఫోర్ బృందం తమ స్పేస్‌షిప్‌లో వచ్చి స్టీవ్‌ను మళ్లీ యుద్ధరంగంలోకి తీసుకెళ్లడం ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది.

డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్

ట్రైలర్‌లో డాక్టర్ డూమ్ పాత్రను చాలా పరిమితంగానే చూపించినా, కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ తన విలనిజంతో వణుకు పుట్టించారు. మీరంతా దొంగిలించిన జీవితాలను గడుపుతున్నారని, ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చే సమయం వచ్చిందని డూమ్ చెప్పే డైలాగ్ సినిమా డార్క్ టోన్‌ను స్పష్టం చేస్తోంది. లాట్వేరియన్ మంత్రగత్తెల బృందంతో కలిసి కనిపించే డూమ్, సెంటినెల్స్ సైన్యాన్ని రంగంలోకి దించడం చూస్తే అతడి శక్తి ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది.

ముఖ్యంగా థోర్ విసిరే శక్తివంతమైన స్టార్మ్‌బ్రేకర్‌ను డాక్టర్ డూమ్ కేవలం తన వేలితో సునాయాసంగా ఆపేసే సన్నివేశం గతంలో థానోస్‌ను మించిన ప్రమాదాన్ని సూచిస్తోంది.

మార్వెల్ హీరోలు

మార్వెల్ చరిత్రలో తొలిసారి అవెంజర్స్, న్యూ అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, వకాండా యోధులు, ఎక్స్-మెన్ ఒకే పోరాటంలో భాగం కావడం ఈ ట్రైలర్ అసలు బలం. రెండు ప్రపంచాలు ఒకదానికొకటి ఢీకొనే ఇంకర్షన్స్ ముప్పును అడ్డుకునేందుకు థోర్ హీరోలందరినీ ఏకం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అవెంజర్స్, ఎక్స్-మెన్ కలిసి డాక్టర్ డూమ్ సైన్యంపైకి దూసుకెళ్లే షాట్.. ఎండ్‌గేమ్ పోర్టల్ సీన్‌ను గుర్తుచేస్తూ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఇంటర్నెట్ షేక్

అవెంజర్స్ డూమ్స్ డే ఫైనల్ ట్రైలర్ తో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఈ ట్రైలర్ రిలీజైన తర్వాత కేవలం 12 గంటల్లోనే 29 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారత్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.100 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టిస్తోంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.