Daredevil OTT: మార్వెల్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ సిరీస్ సీజన్ 2.. సూపర్ హీరో విన్యాసాలు

Daredevil OTT: మార్వెల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఇది. బ్లాక్ బస్టర్ సిరీస్ రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. 'డేర్‌డెవిల్: బోర్న్ అగైన్' సీజన్ 2 ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Mar 25, 2026, 12:49:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ 'డేర్‌డెవిల్: బోర్న్ అగైన్' సీజన్ 2 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో, ఈ రెండో భాగంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ ఇవాళ (మార్చి 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సిరీస్ రెండో సీజన్ (x)
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సిరీస్ రెండో సీజన్ (x)

డేర్‌డెవిల్: బోర్న్ అగైన్ ఓటీటీ

బ్లాక్ బస్టర్ సిరీస్ డేర్‌డెవిల్: బోర్న్ అగైన్ సీజన్ 2 ఓటీటీలో రిలీజైంది. మార్చి 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సిరీస్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

యాక్షన్, విజువల్స్

మార్వెల్ సినిమాలు, సిరీస్ లు అంటేనే యాక్షన్, విజువల్స్ వేరే రేంజ్ లో ఉంటాయి. ఈ డేర్‌డెవిల్ సిరీస్ లోనూ యాక్షన్, విజువల్స్ అదిరిపోయాయనే టాక్ వినిపిస్తోంది. మార్వెల్ ఈ సీజన్ కోసం విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ముఖ్యంగా చీకటి వీధుల్లో సాగే ఫైట్ సీన్లు హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను గుర్తుచేస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశాయని అంటున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి మార్వెల్ అభిమాని చూడాల్సిన సిరీస్.

అవినీతి మేయర్‌తో పోరాటం

డేర్‌డెవిల్ సీజన్ 2లో కథ ప్రధానంగా మాట్ మర్డాక్, విల్సన్ ఫిస్క్ మధ్య సాగే మైండ్ గేమ్స్ చుట్టూ తిరుగుతుంది. నగరాన్ని తన గుప్పిటలో ఉంచుకున్న అవినీతి మేయర్ విల్సన్ ఫిస్క్ (కింగ్‌పిన్) కుతంత్రాలను మాట్ ఎలా అడ్డుకున్నాడో ఈ సిరీస్‌లో చూపించారు. డేర్‌డెవిల్‌గా తన రహస్య పోరాటాన్ని కొనసాగిస్తూనే, న్యాయం కోసం మాట్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.

కొత్త మిత్రులు

నగరాన్ని కాపాడటానికి మాట్ ఈసారి ఒంటరిగా పోరాడటం లేదు. అతనికి తోడుగా జెస్సికా జోన్స్, కరెన్ పేజ్ వంటి పాత్రలు తిరిగి రావడం అభిమానులకు కనువిందుగా ఉంది. కింగ్‌పిన్ సృష్టిస్తున్న భయం నుండి సామాన్యులను రక్షించడానికి మాట్ తన నైతిక విలువలతో చేసే యుద్ధం ఈ సీజన్‌కు హైలైట్‌గా నిలిచింది.

మాస్క్ వెనకాల హీరో

ఈసారి మాట్ తన సొంత నైతికతను కూడా పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఒకవైపు లాయర్‌గా చట్టాన్ని గౌరవించడం, మరోవైపు మాస్క్ ధరించి నేరగాళ్లను శిక్షించడం మధ్య అతడు నలిగిపోతాడు. విల్సన్ ఫిస్క్ వేసే ఎత్తుగడలకు ప్రతిఘటనగా మాట్ తీసుకునే నిర్ణయాలు సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మార్చాయి.

చార్లీ కాక్స్ విశ్వరూపం

మాట్ మర్డాక్‌గా చార్లీ కాక్స్ తన నటనతో మరోసారి మాయ చేశాడు. అంధుడైన లాయర్‌గా, పవర్‌ఫుల్ డేర్‌డెవిల్‌గా అతని బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. విన్సెంట్ డి'ఒనోఫ్రియో కింగ్‌పిన్ పాత్రలో మునుపటి కంటే మరింత క్రూరంగా కనిపించి ప్రేక్షకులను భయపెట్టాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More