...
...
Next Story

Avengers: Doomsday Trailer: 24 గంటల్లోనే 56.3 కోట్ల వ్యూస్.. అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు

Avengers: Doomsday Trailer: 'అవెంజర్స్: డూమ్స్‌డే' కొత్త ట్రైలర్ ఏకంగా 563 మిలియన్ వ్యూస్ సాధించి, డిస్నీ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఆంథోనీ, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ కానుంది.

Published on: Nov 25, 2026, 17:34:35 IST
Advertisement

Avengers: Doomsday Trailer Record: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సూపర్ హీరో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ విజువల్ వండర్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' బాక్సాఫీస్ వేటను విడుదలకు ముందే మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కొత్త ట్రైలర్ ఏకంగా 563 మిలియన్ (56.3 కోట్ల) వ్యూస్ సాధించి.. డిస్నీ (Disney) చరిత్రలోనే అత్యధిక మంది చూసిన ట్రైలర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది.

Avengers: Doomsday Trailer: 24 గంటల్లోనే 56.3 కోట్ల వ్యూస్.. అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు
Avengers: Doomsday Trailer: 24 గంటల్లోనే 56.3 కోట్ల వ్యూస్.. అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు

గతంలో ఇదే సినిమా టీజర్ 24 గంటల్లో సాధించిన 503 మిలియన్ వ్యూస్ రికార్డును, అలాగే 2024లో 'డెడ్‌పూల్ & వోల్వరైన్' సూపర్ బౌల్ టీజర్ సాధించిన 365 మిలియన్ వ్యూస్ రికార్డును ఇది సునాయాసంగా అధిగమించింది.

ట్రైలర్‌లో గూస్‌బంప్స్ తెప్పించే హైలైట్స్.. తిరిగొచ్చిన కెప్టెన్ అమెరికా

హాలీవుడ్ ప్రముఖ దర్శక ద్వయం ఆంథోనీ, జో రుస్సో (Russo Brothers) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మూడు వేర్వేరు యూనివర్స్‌లకు చెందిన సూపర్ హీరోలు ఒకే వేదికపైకి రావడం విశేషం.

'అవెంజర్స్: ఎండ్‌గేమ్' రీ-రిలీజ్‌లో జోడించిన కొత్త సీన్ లో స్టీవ్ రోజర్స్ (క్రిస్ ఎవాన్స్), పెగ్గీ కార్టర్ దంపతులకు ఒక టీనేజ్ కుమారుడు ఉన్నట్లు చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే ఈ కొత్త ట్రైలర్ మొదలవుతుంది. డాక్టర్ డూమ్ నుంచి పొంచి ఉన్న మహా విపత్తును ఎదుర్కోవడానికి 'ఫెంటాస్టిక్ ఫోర్' బృందం టైమ్ ట్రావెల్ చేసి స్టీవ్ రోజర్స్‌ను తిరిగి ప్రధాన టైమ్‌లైన్‌లోకి తీసుకువస్తుంది. తన తండ్రి ఒకప్పటి 'కెప్టెన్ అమెరికా' అనే నిజం స్టీవ్ కుమారుడికి తెలియడం కథలో కొత్త భావోద్వేగాన్ని జోడించింది.

సైక్లోప్స్ తన ఐకానిక్ కామిక్ డైలాగ్ “టు మీ, మై ఎక్స్-మెన్ (To me, my X-Men)” అని పిలుపునివ్వగానే, నైట్‌క్రాలర్ తన శక్తులతో గాంబిట్, మిస్టిక్, బీస్ట్‌లను యుద్ధరంగంలోకి టెలిపోర్ట్ చేసే సన్నివేశం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. వీరితో పాటు మిస్టర్ ఫెంటాస్టిక్, షాంగ్-చి, థోర్, యెలెనా బెలోవా కూడా ఈ మహా సంగ్రామంలో కదం తొక్కుతున్నారు.

కళ్లు చెదిరే భారీ తారాగణం

కెవిన్ ఫీగీ, లూయిస్ డి'ఎస్పోసిటో, జోనాథన్ స్క్వార్ట్జ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ దిగ్గజ నటులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ (డాక్టర్ డూమ్), క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రుడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ పగ్, వెనెస్సా కిర్బీ, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెకెల్లన్, హేలీ అట్వెల్, టామ్ హిడిల్‌స్టన్, పాట్రిక్ స్టీవర్ట్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, లెటిషియా రైట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అమెరికా కంటే ముందే ఇండియాలో గ్రాండ్ రిలీజ్

భారతీయ మార్వెల్ అభిమానులకు చిత్రబృందం మరో తీపి కబురు అందించింది. అమెరికాలో విడుదలయ్యే తేదీ కంటే ఒకరోజు ముందే, అంటే డిసెంబర్ 17, 2026న 'అవెంజర్స్: డూమ్స్‌డే' భారతీయ థియేటర్లలోకి రానుంది.

ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు సహా అన్ని భాషల్లో విడుదలైన ట్రైలర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.

Featured Video

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks