Avengers Doomsday trailer: అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ వచ్చేసింది.. డాక్టర్ డూమ్ పవర్‌ఫుల్ ఎంట్రీ

Avengers Doomsday trailer: అవెంజర్స్ డూమ్స్ డే మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఎంసీయూ నుంచి మరో అదిరిపోయే విజువల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Published on: Jul 20, 2026, 21:55:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avengers Doomsday trailer: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీవర్స్ క్లాష్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' అఫీషియల్ ట్రైలర్ రిలీజై ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ (RDJ) ఈసారి డాక్టర్ డూమ్ అనే మోస్ట్ పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో సంచలన రీఎంట్రీ ఇచ్చారు. మల్టీవర్స్ లోని సూపర్ హీరోలందరినీ ఆయన ఒంటిచేత్తో ఎలా ఎదుర్కొన్నారో ఈ ట్రైలర్‌లో విజువల్ వండర్‌గా చూపించారు.

Avengers Doomsday trailer: అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ వచ్చేసింది..
Avengers Doomsday trailer: అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ వచ్చేసింది..

అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్

ఈ క్రేజీ ట్రైలర్‌లో గాడ్ ఆఫ్ థండర్ థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), డాక్టర్ డూమ్ మధ్య జరిగిన మొదటి ఫైట్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గతంలో థనోస్‌ను సైతం వణికించిన థోర్ పవర్‌ఫుల్ వెపన్ స్టోమ్‌బ్రేకర్‌ను డాక్టర్ డూమ్ చాలా ఈజీగా ఆపడం చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. కొత్తగా ఫామ్ అయిన అవెంజర్స్ టీమ్‌ను ఉద్దేశించి డూమ్ మాట్లాడిన ఇంటెన్స్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.

కెప్టెన్ అమెరికా కంబ్యాక్.. ఎక్స్-మెన్ టీమ్‌తో మహా సంగ్రామం

ఈ మల్టీవర్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేసిన మరో పెద్ద విషయం క్రిస్ ఎవాన్స్ కంబ్యాక్. 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత మళ్లీ కెప్టెన్ అమెరికాగా ఆయన స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్లలో సెలబ్రేషన్స్ గ్యారెంటీగా కనిపిస్తున్నాయి. కేవలం అవెంజర్స్ మాత్రమే కాకుండా ఎక్స్-మెన్ (ప్రొఫెసర్ ఎక్స్, మాగ్నెటో, సైక్లోప్స్, మిస్టిక్, గాంబిట్), ఫెంటాస్టిక్ ఫోర్, థండర్‌బోల్ట్స్ టీమ్స్ అన్నీ ఈ సినిమాలో జాయిన్ అయ్యాయి.

లోకి, షాంగ్-చి తో పాటు వాకాండ వారియర్స్ కూడా డాక్టర్ డూమ్‌ను ఎదుర్కోవడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ స్టార్ కాస్ట్ లిస్ట్ చూస్తే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. పెడ్రో పాస్కల్, పాల్ రడ్, ఆంథోనీ మేకీ, ఫ్లోరెన్స్ పగ్, వెనెస్సా కిర్బీ, టామ్ హిడిల్‌స్టన్, సెబాస్టియన్ స్టాన్ లాంటి టాప్ యాక్టర్స్ ఈ సర్వైవల్ బ్యాటిల్‌లో కనిపించనున్నారు.

సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ థియరీలు

ట్రైలర్ రిలీజైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి యూట్యూబ్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఒకప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్‌ను తట్టుకున్న థోర్ వెపన్‌ను డూమ్ ఇంత సింపుల్‌గా ఆపాడంటే ఆయన ఆరా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఐరన్ మ్యాన్ చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న థోర్.. ఇప్పుడు ఈ కొత్త అవెంజర్స్ టీమ్‌కు డీఫ్యాక్టో లీడర్‌గా మారడం పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా గ్లోబల్ ట్రైలర్‌ను అంతకుముందు లాస్ వెగాస్‌లో జరిగిన ప్రెస్టీజియస్ సినిమాకాన్ ఈవెంట్‌లో మొదటిసారి ప్రదర్శించారు. ఆ స్టేజ్ పై రాబర్ట్ డౌనీ జూనియర్ మాట్లాడుతూ.. ఇంత సక్సెస్ ఫుల్ టీమ్‌తో సరికొత్త క్యారెక్టర్‌లో మళ్లీ కలవడం తన లైఫ్ లోనే ఒక వండర్‌ఫుల్ క్రియేటివ్ జర్నీ అని చెప్పారు. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఇండియాలో డిసెంబర్ 18న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More