నరకమే నన్ను చూసి వణుకుతుంది- థోర్‌నే విసిరేసే పవర్‌ఫుల్ విలన్- అదిరిపోయిన అవేంజర్స్ డాక్టర్ డూమ్స్‌డే తెలుగు గ్లింప్స్!

Avengers Doomsday Special Glimpse Release In Telugu: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'అవేంజర్స్: డూమ్స్‌డే' స్పెషల్ గ్లింప్స్ తెలుగులో విడుదల చేశారు. డాక్టర్ డూమ్‌గా ఐరన్ మ్యాన్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ అదరగొట్టాడు. డూమ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

Published on: Aug 16, 2026, 13:40:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avengers Doomsday Special Glimpse Release In Telugu: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్వెల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవేంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday). ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన సర్‌ప్రైజ్ వీడియోను డిస్నీ డీ23 (D23) ఈవెంట్‌లో చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

నరకమే నన్ను చూసి వణుకుతుంది- థోర్‌నే విసిరేసే పవర్‌ఫుల్ విలన్- అదిరిపోయిన అవేంజర్స్ డాక్టర్ డూమ్స్‌డే తెలుగు గ్లింప్స్!
నరకమే నన్ను చూసి వణుకుతుంది- థోర్‌నే విసిరేసే పవర్‌ఫుల్ విలన్- అదిరిపోయిన అవేంజర్స్ డాక్టర్ డూమ్స్‌డే తెలుగు గ్లింప్స్!

అవేంజర్స్ డూమ్స్‌డే టీజర్ ట్రైలర్‌

కేవలం ట్రైలర్ వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో కూడిన అవేంజర్స్ డూమ్స్‌డే ప్రత్యేక గ్లింప్స్‌ను వదలడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైంది. తాజాగా అవేంజర్స్ డూమ్స్‌డే టీజర్ ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేశారు.

హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంలో 'డాక్టర్ డూమ్' అనే ప్రధాన విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అవేంజర్స్ సిరీస్‌లో సూపర్‌హీరోగా ఆకట్టుకున్న ఆయనే ఇప్పుడు గ్లోబల్ విలన్‌గా మారడం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

డాక్టర్ డూమ్ వెనుక ఉన్న విషాద నేపథ్యం

తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ నాటకీయంగా ప్రారంభమవుతుంది. విక్టర్ వాన్ డూమ్ (డాక్టర్ డూమ్) తన సింహాసనంపై కూర్చుని ఉండగా, సూ స్టార్మ్ (వనెసా కిర్బీ) నేపథ్య గొంతుతో ఆ కథనం సాగుతుంది.

"ఏ గదిలో ఉన్నా అందరికంటే తెలివైన వ్యక్తి అతడే.. కానీ తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయాక మానసికంగా దారి తప్పాడు" అని సూ స్టార్మ్ చెప్పే మాటలు విలన్ పాత్రలోని భావోద్వేగ లోతును తెలియజేస్తున్నాయి.

ఆ తర్వాత ప్రపంచం మొత్తం నాశనమై శిథిలావస్థకు చేరిన దృశ్యాలను చూపించారు. ఈ విధ్వంసానికి కారణం నువ్వేనా అని రీడ్ రిచర్డ్స్ (పెడ్రో పాస్కల్) నేరుగా డూమ్‌ను ప్రశ్నించడం కథలోని తీవ్రతను పెంచుతోంది.

థోర్‌ను సులువుగా మట్టికరిపించిన విలన్

అవేంజర్స్ డూమ్స్‌డే గ్లింప్స్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), డాక్టర్ డూమ్ మధ్య జరిగే పోరాటమే. థోర్ తన పూర్తి శక్తితో విరుచుకుపడుతూ, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానని మీదకు దూకుతాడు. కానీ, డాక్టర్ డూమ్ ఏమాత్రం భయపడకుండా, చాలా సులువుగా థోర్ దాడిని అడ్డుకుని పక్కకు విసిరేస్తాడు.

"ఆ నరకమే నన్ను చూసి వణుకుతుంది.. ఎందుకంటే నేనే డూమ్" అని రాబర్ట్ డౌనీ జూనియర్ చెప్పే డైలాగ్ మాములుగా లేదు. ఇది మార్వెల్ చరిత్రలోనే ఒక ఐకానిక్ డైలాగ్‌గా నిలిచిపోనుంది. ఇక ఈ పోరు ముగిసిన వెంటనే డూమ్ తన భయంకరమైన సెంటినెల్స్‌ను ప్రపంచం మీదికి వదులుతాడు.

మూడు విభిన్న ప్రపంచాల కలయిక

మ్యాగ్నెటో, స్టీవ్ రోజర్స్ (కెప్టెన్ అమెరికా), షాంగ్-చి, షూరి, గ్యాంబిట్ వంటి సూపర్ హీరోలు ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఒకటవుతున్నట్లు వీడియోలో స్పష్టం చేశారు. రూసో బ్రదర్స్ (ఆంథోనీ, జో రూసో) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెవిన్ ఫేజ్ నిర్మిస్తున్నారు.

2019లో వచ్చిన 'అవేంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వస్తున్న అతిపెద్ద అవేంజర్స్ చిత్రం ఇదే కావడ విశేషం. ఈ సినిమాలో ఏకంగా మూడు వేర్వేరు మార్వెల్ యూనివర్స్‌ల నుంచి హీరోలు ఒకే వేదికపైకి వచ్చి డాక్టర్ డూమ్ అనే తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటారు.

హాలీవుడ్ దిగ్గజాలు

హాలీవుడ్ దిగ్గజాలు క్రిస్ ఈవాన్స్, పాల్ రడ్, ఫ్లోరెన్స్ ప్యూ, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, టామ్ హిడిల్‌స్టన్ సహా భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. భారతదేశంలోనూ మార్వెల్ సినిమాలకు మైండ్ బ్లోయింగ్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: 'డ్యూన్స్‌డే' హంగామా

ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే రోజున వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'డ్యూన్' మూడో భాగం కూడా విడుదల కానుంది. హాలీవుడ్ రెండు అతిపెద్ద సినిమాలు ఒకే రోజు పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ నిపుణులు దీనిని 'డ్యూన్స్‌డే' (Dunesday) పోరుగా అభివర్ణిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More