Mahesh Babu Varanasi: మహేష్ బాబు బర్త్‌డే సర్‌ప్రైజ్-వారణాసి నుంచి స్టిల్స్ రిలీజ్-ఏం ఉన్నాడ్రా బాబు-మరి గ్లింప్స్?
Mahesh Babu Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది. వారణాసి మూవీ నుంచి రుద్ర గెటప్ లో మహేష్ బాబు రెండు స్టిల్స్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. ఏం ఉన్నాడ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గ్లింప్స్ రిలీజ్ చేయరా? అనే ప్రశ్నలూ వస్తున్నాయి.
Mahesh Babu Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే (ఆగస్టు 9) సర్ ప్రైజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి'లో మహేష్ బాబును అత్యంత శక్తివంతమైన 'రుద్ర' అనే పాత్రలో పరిచయం చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రుద్ర పాత్ర స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

వారణాసి నుంచి స్టిల్స్
ఇవాళ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా వారణాసి నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు రెండు ఫొటోలను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ స్టిల్స్‌లో మహేష్ బాబు ఎంతో రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉన్నప్పటికీ, అతని కళ్లల్లో ఒక విధమైన ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీడియో గ్లింప్స్ లేదా?
మహేష్ బాబు బర్త్ డే రోజు వారణాసి మూవీ నుంచి వచ్చిన ఫొటోలు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ వీడియో గ్లింప్స్ కోసం తెగ ఆత్రుతగా వెయిట్ చేస్తున్న వాళ్లు మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. కేవలం ఫొటోలతో సరిపెట్టుకుంటారా? వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయరా? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు.
మేకర్స్ ప్లాన్
రీసెంట్ గా గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా కూడా మేకర్స్ వీడియో గ్లింప్స్ ఇవ్వకుండా కేవలం ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మహేష్ బాబు పుట్టినరోజుకి కూడా అదే వ్యూహాన్ని అమలు చేశారు. ప్రమోషన్ల ప్రారంభంలోనే కంటెంట్ మొత్తాన్ని బయటపెట్టకుండా, ఒక్కో పాత్రను స్టిల్స్ ద్వారా ఎలివేట్ చేస్తున్నారు. ఇలా అంచనాలను నిలబెట్టడం రాజమౌళి మార్క్ ప్రమోషనల్ స్ట్రాటజీగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాజమౌళి ఎలివేషన్
రుద్ర పాత్ర గురించి రాజమౌళి వివరిస్తూ.. "తనకంటే అత్యంత పెద్దదైన ఒక గొప్ప లక్ష్యం కోసం, తాను కోరుకోని విధిని మోస్తూ జన్మించిన వ్యక్తి 'రుద్ర'. ఈ పాత్రలో ఒక రకమైన సమయస్ఫూర్తి, సున్నితత్వం, భయంకరమైన రౌద్రం (Fierceness) ఉంటాయి. బలమైన పౌరుషాన్ని, అంతే సున్నితమైన భావోద్వేగాలను మహేష్ బాబు తన నటనతో ఈ పాత్రలోకి తీసుకొచ్చారు" అని ప్రశంసల వర్షం కురిపించారు.
ఆఫ్రికా షెడ్యూల్‌లో భాగంగా కిలిమంజారో పర్వత ప్రాంతాలు, మాసాయి మారా అడవుల్లో తీసిన సన్నివేశాల స్కేల్‌ను 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా పూర్తిగా బంధించలేకపోయిందని రాజమౌళి పేర్కొనడం సినిమా లార్జర్ దెన్ లైఫ్ మేకింగ్‌కు నిదర్శనం.
వారణాసి రిలీజ్ డేట్
కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


