Actor: ఇదేందయ్యా.. సినిమా అంటే ఇంత పిచ్చా?.. స్టేజీపైనే చెంపపై టపాటపా కొట్టుకున్న నటుడు.. అందరూ షాక్.. వీడియో వైరల్

Actor: కొంతమందికి సినిమా అంటే ఎంతో పిచ్చి ఉంటుంది. ఒక్కసారైనా సినిమాలో నటించాలని, బిగ్ స్క్రీన్ పై కనిపించాలని కలలు కంటుంటారు. ఆ కల నిజమైనప్పుడు వాళ్ల ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. తాజాగా నటుడు పుట్టా భాను అలాంటి ఎమోషన్ తోనే చేసిన ఓ పని తెగ వైరల్ గా మారింది. మూవీ ఈవెంట్లోనే అతను చెంపపై కొట్టుకున్నాడు.

Published on: Aug 6, 2026, 06:21:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor: తెలుగులో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘హుషార్ పిట్టలు’ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన పుట్టా భాను అనే నటుడు చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది.

ఇదేందయ్యా.. సినిమా అంటే ఇంత పిచ్చా?.. స్టేజీపైనే చెంపపై టపాటపా కొట్టుకున్న నటుడు.. అందరూ షాక్.. వీడియో వైరల్
ఇదేందయ్యా.. సినిమా అంటే ఇంత పిచ్చా?.. స్టేజీపైనే చెంపపై టపాటపా కొట్టుకున్న నటుడు.. అందరూ షాక్.. వీడియో వైరల్

చెంపపై కొట్టుకుంటూ

హుషార్ పిట్టలు మూవీ ప్రెస్ మీట్ లో అందరూ మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మైక్ అందుకున్న పుట్టా భాను స్టేజీపై చేసిన పని అక్కడ ఉన్న వాళ్లందరిని ఒక్కసారిగా కంగారు పెట్టింది. మైక్ లో మాట్లాడుతూనే, ఒక్క క్షణం అంటూ తన చెంపలపై తానే బలంగా నాలుగైదు దెబ్బలు వేసుకున్నాడు భాను. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బిగ్ స్క్రీన్ పై

హుషార్ పిట్టలు సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో పుట్టా భాను ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా పేరు పుట్టా భాను. సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా పుట్టా భానునే. నాకున్న సినిమా పిచ్చితో మా ఊరి థియేటర్లో ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షోకు వెళ్లేవాడిని. స్క్రీన్ మీద ఏదైనా కామెడీ సీన్ వస్తే పగలబడి నవ్వేవాడిని. మొన్న మా సినిమా ప్రివ్యూ వేశారు. అప్పుడు అంత పెద్ద స్క్రీన్ మీద నా కామెడీ చూసి సీట్లలో కూర్చున్న వాళ్లు నవ్వారు’’ అని పుట్టా భాను చెప్పుకొచ్చాడు.

కలనో నిజమో

‘‘ఇది కలనో నిజమో అసలు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం’’ అని ఆగి తన చెంపపై కొట్టుకున్నాడు భాను. దీంతో వెనుకాల ఉన్న హీరో హీరోయిన్ తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘ఇది నమ్మలేకపోతున్నా. ఇది కావాలని చేయలేదు. నేను అంత పెద్ద స్క్రీన్ మీద కనిపించానా? 8 ఏళ్ల నుంచి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సినిమానే లైఫ్ అని ఉన్నా. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని భాను ఏడ్చేశాడు.

యూత్ ఫుల్ లవ్ స్టోరీ

హుషార్ పిట్టలు సినిమాను యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఇందులో అన్ష్, వాసవి గణేష్ జంటగా నటించారు. గోవర్ధన్, సునీతా మనోహర్, రమేష్, అంజి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భిక్షు డైరెక్టర్. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లకు రాబోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More