OTT Release: ఈ సినిమా ఎంతో స్పెషల్.. ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ అవుతుందన్న విజయ్ ఆంటోనీ.. రెండు రోజుల్లోనే ఓటీటీలోకి ఆ మూవీ!

OTT Release: బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఈ స్టార్ హీరో తాజాగా ఓ మూవీ తనకెంతో స్పెషల్ అని చెప్పాడు. అది కచ్చితంగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని అన్నాడు. మరి ఇంకా రెండు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న ఆ సినిమా ఏదో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 5, 2026, 13:52:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release: డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో విజ‌య్ ఆంటోని. అతను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. త‌మిళంలో ‘నూరు సామి’గా రిలీజైన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

ఈ సినిమా ఎంతో స్పెషల్.. ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ అవుతుందన్న విజయ్ ఆంటోనీ.. రెండు రోజుల్లోనే ఓటీటీలోకి ఆ మూవీ
ఈ సినిమా ఎంతో స్పెషల్.. ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ అవుతుందన్న విజయ్ ఆంటోనీ.. రెండు రోజుల్లోనే ఓటీటీలోకి ఆ మూవీ

వంద దేవుళ్లు ఓటీటీ

‘బిచ్చ‌గాడు’ సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా వంద దేవుళ్లు తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

ఫుల్ ఎమోషన్స్

‘వంద దేవుళ్లు’ (నూరు సామి) చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు నటించారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రంలో భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, ఆక‌ట్టుకునే నటన, సమకాలీన సామాజిక అంశాలను సున్నితంగా చూపించిన తీరు కోసం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

రియల్ ఇన్సిడెంట్లు

నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ వంద దేవుళ్లు చిత్రం విధవరాలైన తల్లి సెల్వి కథను ఆవిష్క‌రించింది. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేసే క్ర‌మంలో జీవితాన్ని అంకితం చేసిన ఆమె.. పిల్ల‌లు పెరిగి పెద్ద‌యిన తర్వాత జీవితంలో తోడుగా ఎవరో కావాలనుకుంటుంది.

అలాంటి స‌మ‌యంలో సమాజంలోని పాత సాంప్రదాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వంద దేవుళ్లు’ మూవీ మాతృత్వం, గౌరవం, క‌ఠిన నిర్ణ‌యాల‌ను అంగీక‌రించే విధానం, సామాజికంగా ఎదురయ్యే స‌మ‌స్య‌లు, ధైర్యం వంటి అంశాల క‌ల‌యిక‌గా హృదయాన్ని కదిలించే కథగా తెర‌కెక్కించారు.

తల్లి కోసం

వంద దేవుళ్లు సినిమా కథను గమనిస్తే.. సాంప్రదాయ ధోరణులను దాటి కొత్తగా ఆలోచింపజేసే తల్లి, కొడుకు బంధం తెలుస్తుంది. సాధారణంగా తల్లి త్యాగాలను మాత్రమే ప్రశంసించే కథలకంటే భిన్నంగా, ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)లో తన తల్లికి అండగా నిలబడి ఆమె జీవితం సంతోషంగా ఉండటానికి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్రోత్సహించే కొడుకు ఎలా ఉంటాడ‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తుంది.

చాలా స్పెషల్

విజ‌య్ ఆంటోని ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి సినిమాకీ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ‘వంద దేవుళ్లు’ సినిమా నాకెంతో స్పెషల్. ఎందుకంటే ఇందులో ఉన్న భావోద్వేగాలు చాలా లోతైనవి. ఈ కథలో తల్లి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా నిలుస్తుంది. సినిమాలో ఉన్న సందేశంతో ప్రేక్షకులు గాఢంగా క‌నెక్ట్ అవుతార‌ని నేను నమ్ముతున్నా’’ అని అన్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More