OTT Telugu: ఓటీటీలోకి 20 రోజుల్లోనే తెలుగు కామెడీ డ్రామా.. ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

OTT Telugu: ఓటీటీలోకి మూడు వారాల్లోనే తెలుగు కామెడీ డ్రామా మూవీ ఓ సుకుమారి స్ట్రీమింగ్ కు వస్తోంది. జులై 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Aug 4, 2026, 15:23:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ (Thiruveer), సంక్రాంతికి వస్తున్నాం భామ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కామెడీ డ్రామా 'ఓ సుకుమారి' (Oh Sukumari) డిజిటల్ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. జులై 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది.

OTT Telugu: ఓటీటీలోకి 20 రోజుల్లోనే తెలుగు కామెడీ డ్రామా.. ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
OTT Telugu: ఓటీటీలోకి 20 రోజుల్లోనే తెలుగు కామెడీ డ్రామా.. ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

బిగ్ స్క్రీన్ పై అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఓ సుకుమారి మూవీ ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

థియేటర్లలో సరైన ప్రమోషన్లు లేకపోవడం, మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టడంలో ఈ సినిమా విఫలమైంది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు లభించే ఆదరణ చూసి ఓటీటీ ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

అసలు కథేంటంటే?

నరాల యాదగిరి (తిరువీర్) తన సొంత పల్లెటూరిలో సర్పంచ్ అవ్వాలని ఆశపడుతాడు. అతని తాత రాసిన విచిత్రమైన వీలునామా ప్రకారం.. యాదగిరికి లేదా అతని బాబాయ్ కొడుక్కి ఎవరికైనా సరే మొదట మగబిడ్డ పుడితేనే వారి కుటుంబానికి రూ.80 కోట్ల విలువైన ఆస్తి దక్కుతుంది. ఈ క్రమంలో ఒక పెళ్లి చూపుల దగ్గర దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి యాదగిరి మనసు పారేసుకుంటాడు. వెంటనే పెళ్లి ప్రపోజల్ పెడతాడు.

అయితే దామినికి ఒక వింత సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకిన వారికి కరెంట్ షాక్ కొడుతుంది. దామిని వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్న ఆ ఊరి జనాలు ఎవరికీ నిజం చెప్పకుండా, ఎలాగోలా యాదగిరితో పెళ్లి జరిపిస్తారు. పెళ్లయి శోభనం రాత్రి యాదగిరికి ఈ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత యాదగిరి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? సర్పంచ్ ఎలా అయ్యాడు? వారిద్దరూ ఎలా కలిసి జీవించారు? యాదగిరి తాత ఆస్తిని దక్కించుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

'మసూద' ఫేమ్ తిరువీర్ కాంబో.. ఎక్కడ మిస్ అయింది?

'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే తిరువీర్, ఈ సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక సరదా కుర్రాడి పాత్రలో కనిపించారు.

అలాగే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, నేచురల్ రోల్స్‌తో మెప్పించే ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. దర్శకుడు భరత్ దర్శన్ రాసుకున్న కథలో కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా లేకపోవడమే బాక్సాఫీస్ ఫ్లాప్‌కు కారణమని సినీ విమర్శకులు భావిస్తున్నారు.

సీనియర్ నటుల సందడి.. ఓటీటీలో కంబ్యాక్ ఇస్తుందా?

ఈ సినిమాలో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి లాంటి సీనియర్ నటీనటులు కీలకమైన పాత్రల్లో నటించి తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మధ్య కాలంలో థియేటర్లలో ప్లాప్ అయిన చాలా సినిమాలు ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచాయి. అదే తరహాలో 'ఓ సుకుమారి' కూడా డిజిటల్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుని బిగ్ హిట్ కానుందో లేదో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More