OTT Trending: ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్న సినిమా ఏదో తెలుసా? ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్

OTT Trending: ఇలా ఓటీటీలోకి వచ్చిందో లేదో.. అలా ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది ఓ తమిళ సినిమా. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని మన ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏంటో తెలుసుకోండి. 

Published on: Aug 1, 2026, 18:17:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Trending: ఓటీటీలో ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా తమిళ సినిమా ‘గట్ట కుస్తీ 2’ మరోసారి నిరూపిస్తోంది. విష్ణు విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన వినోదాత్మక చిత్రం 'గట్ట కుస్తీ 2' (Gatta Kusthi 2) డిజిటల్ స్పేస్‌లో అదరగొడుతోంది. ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.

ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్న సినిమా ఏదో తెలుసా? ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్
ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్న సినిమా ఏదో తెలుసా? ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్

గట్ట కుస్తీ ఓటీటీ ట్రెండింగ్

రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గట్ట కుస్తీ 2 చిత్రం ఓటీటీని షేక్ చేస్తోంది. శుక్రవారం (జూలై 31)న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ సినిమాగా ట్రెండింగ్ లో నిలిచింది. స్ట్రీమింగ్ మొదలైన అతితక్కువ సమయంలోనే ఇండియా వైడ్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని (No. 1 Trending) దక్కించుకుంది.

తెలుగు జనాలు కూడా

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఒకేసారి ఐదు భాషల్లో గట్ట కుస్తీ 2 ఓటీటీలో రిలీజ్ అయింది. దీంతో దక్షిణాది, నార్త్ బెల్ట్ తేడా లేకుండా ఆడియన్స్ ఈ సినిమాపై విశేషమైన ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి మరీ చూసేస్తున్నారు.

కట్టిపడేస్తున్న 'కుస్తీ' వినోదం

గట్ట కుస్తీ మూవీ ఫస్ట్ పార్ట్ లో భార్యాభర్తల ఈగో కలహాలు, రెజ్లింగ్ చుట్టూ తిరిగే కామెడీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న మేకర్స్, ఈ సీక్వెల్‌లో మరింత డోస్ పెంచారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ కామెడీ కంటెంట్ కావడం ఈ సినిమాకు ఓటీటీలో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. తెలుగు డబ్బింగ్ వర్షన్ సంభాషణలు, మన నేటివిటీకి తగ్గట్టుగా ఉండటంతో ఏపీ, తెలంగాణ ఓటీటీ వీక్షకులు ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్

ఓటీటీ ట్రెండ్స్, ట్రేడ్ అనలిటిక్స్ పరంగా పరిశీలిస్తే.. 'గట్ట కుస్తీ 2' నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్‌లలో నంబర్ 1 పొజిషన్ దక్కించుకోవడం వెనుక బలమైన ఎడిటోరియల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యూహం ఉంది.

ఇటీవలి కాలంలో ఓటీటీ వీక్షకులు సుదీర్ఘమైన లేదా తీవ్రమైన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ల కంటే.. 2 గంటల వ్యవధిలో మనస్పూర్తిగా నవ్వుకునే లైట్-హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒకేసారి 5 భాషల్లో ఈ చిత్రాన్ని పాన్-ఇండియా వైడ్‌గా రీజినల్ మార్కెట్లలోకి వదలడం వల్ల సబ్‌స్క్రిప్షన్ బేస్ వీక్షణలు వేగంగా పెరిగాయి.

వీకెండ్ ప్రారంభంలోనే లభించిన ఇన్స్టంట్ 'వర్డ్ ఆఫ్ మౌత్' (Word of Mouth) ఈ సినిమాను వ్యూయర్‌షిప్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ప్రాంతీయ సరిహద్దులు దాటి కామెడీ కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో 'గట్ట కుస్తీ 2' సాధిస్తున్న డిజిటల్ నంబర్స్ మరోసారి నిరూపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More