OTT Telugu: మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్- ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు లవ్ స్టోరీ మూవీ- 5 రోజులే- 9.2 రేటింగ్!
OTT Telugu: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు లవ్ స్టోరీ మూవీ వచ్చేస్తోంది. మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్ అంటూ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉంది. మరి ఈ సినిమా పేరు ఏంటీ? ఏ ఓటీటీలోకి వచ్చేస్తుందో ఇక్కడ చూసేయండి.
OTT Telugu: యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా 'దీవానా' (Deewana). ఈ ఏడాది జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే యూత్ నుంచి ఈ మూవీకి మంచి ఆదరణ వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది.

దీవానా ఓటీటీ రిలీజ్ డేట్
దీవానా చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' (Aha) దక్కించుకుంది. జూలై 31, 2026 నుంచి ఈ సినిమా అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మిస్ అయితే మస్ట్ ఫీల్ అయితవ్’ అని పేర్కొంటూ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆహా వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్.
తమిళంలోనూ
అయితే 'ఆహా గోల్డ్' (Aha Gold) సబ్‌స్క్రైబర్లకు ఈ ఓటీటీ ప్రత్యేక ఆఫర్ కలిపించింది. దీవానా సినిమాను 24 గంటల ముందే అంటే జూలై 30 నుంచే వీక్షించే అవకాశాన్ని అందించింది. థియేటర్లలో కేవలం తెలుగులోనే విడుదలైన ఈ చిత్రాన్ని, ఓటీటీ డిజిటల్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా తమిళ భాషలో కూడా డబ్ చేసి రీలీజ్ చేస్తుండటం విశేషం.
స్టోరీ ఇదే
దీవానా మూవీ యూత్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇది మున్నా, అమ్ము మధ్య ప్రేమ కథ చుట్టూ తిరుగుతోంది. అల్లరిచిల్లరిగా తిరిగే మున్నా ఒకసారి అమ్మును చూసి లవ్ చేస్తాడు. కానీ అమ్ము అంత ఈజీగా ఒప్పుకోదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మాత్రం ఓకే అని కండీషన్ పెడుతుంది. దీంతో జాబ్ కోసం మున్నా ట్రై చేస్తాడు. అయితే అతను అరెస్టు అవడమే కథలో ట్విస్ట్. మున్నా ఎందుకు జైలుకు వెళ్లాడు? అమ్మును పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే మిగతా కథ.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో
గీతా ఆర్ట్స్ సమర్పణలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి దీవానా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్, 'బలగం' వేణు వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. లవ్, ఎమోషన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్రధాన బలమైంది.
ఓటీటీలో ఏం చేస్తుందో?
ఓటీటీ ట్రెండ్స్, ట్రేడ్ విశ్లేషణ ప్రకారం.. థియేటర్లలో యావరేజ్ వసూళ్లు సాధించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామాలు ఆహా వంటి రీజనల్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి డిజిటల్ వ్యూయర్‌షిప్ సాధిస్తుంటాయి. గీతా ఆర్ట్స్ బ్రాండ్ తోడుకావడం, తమిళ వెర్షన్ కూడా అందుబాటులోకి తేవడం వల్ల ఓటీటీ రన్‌లో దీవానా చిత్రానికి మరింత మైలేజ్ లభించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


