...
...
Next Story

ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. అఖండ 2 మరో టీజర్ రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే

బాలకృష్ణ అఖండ 2 నుంచి మరో టీజర్ రిలీజైంది. మాస్ యాక్షన్, డైలాగ్స్ తో బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఈ టీజర్ ఉంది. బోయపాటి, బాలయ్య మార్క్ మరోసారి స్పష్టంగా కనిపించింది.

Published on: Oct 24, 2025, 17:40:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిస్తే థియేటర్లలో దద్దరిల్లిపోవాల్సిందే. అదే రొటీన్ మాస్ యాక్షన్, డైలాగులతో అఖండ 2 రెండో టీజర్ కూడా శుక్రవారం (అక్టోబర్ 24) రిలీజైంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ మసాలా మొత్తం ఈ టీజర్లో ఉంది.

అఖండ 2 తాండవం టీజర్

ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. అఖండ 2 మరో టీజర్ రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే
ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. అఖండ 2 మరో టీజర్ రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ అఖండ 2. ఇప్పటికే ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టగా.. ఇప్పుడీ అఖండ 2 తాండవంతో మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందే ఓ టీజర్ రిలీజ్ కాగా.. అందులో బాలకృష్ణ ఓ అఘోరా అవతారంలో చేసిన మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.

ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన మరో టీజర్లో బాలయ్య మరో అవతారాన్ని బోయపాటి చూపించాడు. అదే మాస్ యాక్షన్, డైలాగులతో ఈ 57 సెకన్ల టీజర్ సాగిపోయింది. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు.. నీ ఊహకు కూడా అందదు” అంటూ తన మార్క్ డైలాగుతో బాలకృష్ణ అదరగొట్టాడు. ఇందులో మురళీకృష్ణ అనే పాత్రను పరిచయం చేసినట్లు చెబుతున్నారు.

అఖండ 2 మూవీ గురించి..

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ ఓ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడీ సినిమాకు అఖండ 2 తాండవం పేరుతో సీక్వెల్ వస్తోంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఫిమేల్ లీడ్ గా హర్షాలీ మల్హోత్రా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు మూవీ. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe