...
...
Next Story

Balakrishna Daughter: సాయి పల్లవి పాటపై డ్యాన్స్‌తో ఇరగదీసిన బాలకృష్ణ చిన్న కూతురు.. వీడియో వైరల్

Balakrishna Daughter: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మరోసారి డ్యాన్స్‌తో ఇరగదీసింది. సాయి పల్లవి పాపులర్ సాంగ్ సారంగదరియాపై ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన స్టెప్పులతో సాయి పల్లవిని కూడా మైమరిపించింది.

Published on: Jul 13, 2026, 09:33:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Balakrishna Daughter: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సాయి పల్లవి సూపర్ హిట్ సాంగ్ 'సారంగ దరియా'కు ఆమె వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా ఆమె ఇచ్చిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వరుస వీడియోలతో హల్‌చల్

Balakrishna Daughter: సాయి పల్లవి పాటపై డ్యాన్స్‌తో ఇరగదీసిన బాలకృష్ణ చిన్న కూతురు.. వీడియో వైరల్
Balakrishna Daughter: సాయి పల్లవి పాటపై డ్యాన్స్‌తో ఇరగదీసిన బాలకృష్ణ చిన్న కూతురు.. వీడియో వైరల్

కొన్ని రోజుల కిందట కూడా తేజస్విని డ్యాన్స్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. భానూ మాస్టర్ తో కలిసి వేసిన ఆ డ్యాన్స్ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయింది.

అయితే ఈ లేటెస్ట్ 'సారంగ దరియా' వీడియో ఆ పాత క్లిప్‌ని మించిపోయిందని అభిమానులు మురిసిపోతున్నారు. ఇంతకాలం పబ్లిక్ లైఫ్‌కు, కెమెరాకు దూరంగా ఉన్న బాలయ్య కూతురిలో ఈ కొత్త యాంగిల్ చూసి అందరూ పాజిటివ్‌గా సర్‌ప్రైజ్ అవుతున్నారు.

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఊహాగానాలు

పబ్లిక్‌గా ఆమె కనిపిస్తున్న ప్రతిసారీ ఒక కొత్త కోణం బయటపడుతోంది. తేజస్వినిలో పెరుగుతున్న కాన్ఫిడెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే.. భవిష్యత్తులో కచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఒకవైపు డాన్స్ వీడియోలతో ట్రెండ్ అవుతూనే, మరోవైపు బిజినెస్, సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా ఆమె స్పీడ్ పెంచారు. క్రియేటివ్ డెవలప్‌మెంట్, కంటెంట్ సెలక్షన్‌లో నాన్నకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటూ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.

ప్రొడక్షన్‌లో కీ రోల్.. కెమెరా ముందుకు గ్రాండ్ ఎంట్రీ

కేవలం డ్యాన్స్ వీడియోలే కాకుండా నందమూరి బాలకృష్ణ లైనప్‌లో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ బాధ్యతలను కూడా తేజస్విని తన భుజాలపై వేసుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK 111' సినిమాకు ఆమె ప్రొడక్షన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు. నాన్న సినిమాలే కాకుండా, ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రొడక్షన్ పనులను కూడా ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

హైదరాబాద్‌కు చెందిన పాపులర్ బ్రాండ్ 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ భారీ కమర్షియల్ యాడ్‌లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, నందమూరి తేజస్విని టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe