నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే బాలయ్య కూతురు స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. అతని చిన్న కూతురు తేజస్విని ఈ మధ్యే సిద్ధార్థ జువెలర్స్ యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ ను ఆమెనే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనిని చూసిన ఓ అభిమాని అచ్చూ రకుల్‌ప్రీత్ సింగ్ లా ఉన్నావని కామెంట్ చేయడం విశేషం.
నందమూరి తేజస్విని యాడ్

నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నటించిన ఓ కమర్షియల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. “నా తొలి ఆన్ స్క్రీన్ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుబా హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.
దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అనే క్యాప్షన్ తో తేజస్విని ఈ యాడ్ షేర్ చేసింది. ఈ యాడ్ మొదట్లో ఆమె ఓ మోడర్న్ డ్రెస్ లో చేతికి ఓ డైమండ్ రింగ్ తో కనిపించింది. ఆ తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఒంటి నిండా నగలతోనూ మెరిసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
నందమూరి వంశం నుంచి వచ్చిన తేజస్విని కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తొలి యాడ్ లోనే ఆమె తన అందం, నటనతో ఆకట్టుకుంది. చాలా సహజంగా కనిపించింది. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ నటన మీ రక్తంలోనే ఉంది కదా అని కామెంట్ చేయడం విశేషం. మిమ్మల్ని సడెన్ గా చూసి రకుల్ ప్రీత్ అనుకున్నా.. అలాగే ఉన్నారు అని మరో అభిమాని అన్నారు.
వీడియో చాలా బాగుంది.. ఇలాగే సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటించండి అని మరికొందరు సూచించారు. చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాడ్ ను యమన కిశోర్ డైరెక్ట్ చేశారు. ఇక బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చూసుకుంది. తమన్ మ్యూజిక్ అందించాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డాబూ రత్నానీ ఆమె ఫొటోలను తీశాడు. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
{{/usCountry}}వీడియో చాలా బాగుంది.. ఇలాగే సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటించండి అని మరికొందరు సూచించారు. చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాడ్ ను యమన కిశోర్ డైరెక్ట్ చేశారు. ఇక బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చూసుకుంది. తమన్ మ్యూజిక్ అందించాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డాబూ రత్నానీ ఆమె ఫొటోలను తీశాడు. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
{{/usCountry}}