Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ అటకెక్కిందా? పుకార్లపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదీ

Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ ఆగిపోయిందా? ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అటకెక్కించారా? దీనిపై రెండు రోజులుగా వస్తున్న పుకార్లకు మొత్తానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

Published on: Aug 17, 2026, 21:50:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna Koratala Siva: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటికే ప్రారంభమైన #NBK112 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ మూవీ ఆగిపోయిందంటూ వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెడుతూ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. బాలయ్య - కొరటాల ప్రాజెక్ట్ పక్కాగా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు.

Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ అటకెక్కిందా? పుకార్లపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదీ
Balakrishna Koratala Siva: బాలకృష్ణ, కొరటాల శివ మూవీ అటకెక్కిందా? పుకార్లపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదీ

రకరకాల కారణాలు.. ప్రాజెక్ట్ అటకెక్కిందంటూ..

గత రెండు రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎన్‌బీకే 112 సినిమా గురించి రకరకాల ప్రచారాలు నడిచాయి. బాలయ్య మోకాలు సర్జరీ రికవరీ కారణం అని కొందరు, బడ్జెట్ హద్దులు దాటడంతో ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హీరో, డైరెక్టర్ మధ్య క్రియేటివ్ తేడాలు వచ్చాయంటూ కూడా ఫిల్మ్ నగర్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది.

అధికారిక ప్రకటనతో రూమర్లకు చెక్

అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్‌లో క్లారిటీ ఇచ్చింది. "నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దు. ఈ ప్రతిష్టాత్మక సినిమా ఖచ్చితంగా జరుగుతోంది" అని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #NBK111 షూటింగ్ పూర్తి కాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ వెల్లడించారు.

జూన్‌లో విజయవాడలో గ్రాండ్ లాంచ్

ఈ ఏడాది జూన్ నెలలో విజయవాడలో ఈ ప్రాజెక్ట్ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తొలి షాట్‌కి క్లాప్ కొట్టి ఈ క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్), సుధాకర్ మిక్కిలినేని (యువసుధ ఆర్ట్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ కొరటాల శివ ట్రాక్ రికార్డ్

డైరెక్టర్ కొరటాల శివకు టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ ఉంది. మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్లు అందించారు.

చిరంజీవితో తీసిన 'ఆచార్య' నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'దేవర'తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకున్నారు.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ మాస్ ఇమేజ్‌కి తనదైన సోషల్ మెసేజ్ జోడించి కొరటాల శివ ఓ సాలిడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. 'పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్' అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బాలయ్య ఫుల్ బిజీ లైన్అప్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస బాక్సాఫీస్ సక్సెస్‌లతో ఫుల్ జోరు మీదున్నారు. 'అఖండ 2: తాండవం' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేకర్స్ ఇచ్చిన ఈ అఫీషియల్ క్లారిటీతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More