అఖండ 2లో హిందూ సనాతన ధర్మం శక్తి, పరాక్రమాన్ని చూస్తారు.. 130 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం: బాలకృష్ణ కామెంట్స్
అఖండ 2 సినిమాలో హిందూ సనాతన ధర్మ గొప్పతనం, శక్తి, పరాక్రమాలను చూస్తారని అన్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ లాంచ్ ను ముంబైలో చేసిన సందర్భంగా బాలయ్య అక్కడి వాళ్ల కోసం హిందీలోనే మాట్లాడటం విశేషం.
అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా శుక్రవారం (నవంబర్ 14) ముంబైలో ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ లాంచ్ చేశారు. మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొంది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం శక్తి, పరాక్రమాన్ని చూస్తారని చెప్పాడు.

అఖండ 2పై బాలకృష్ణ ఏమన్నాడంటే?
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ అఖండ 2. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ కొట్టారు. దీంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ తాండవం లాంచ్ సందర్భంగా మూవీ గురించి బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అఖండ తాండవం మూవీలో హిందూ సనాతన ధర్మం గొప్పదనం, శక్తి, పరాక్రమాన్ని చూస్తారని చెప్పాడు. మన హిందూ ధర్మం ఎప్పుడూ సత్య మార్గంలోనే వెళ్లానని, అన్యాయానికి తల వంచకూడదని చెబుతుంది.. ఇదే ఈ సినిమాలో మీరు చూడబోతున్నారని అన్నాడు.
ఇక ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయని, ఈ అఖండ 2 కూడా కాబోతోందని జోస్యం చెప్పాడు. బోయపాటితో అనుబంధం గురించి కూడా మాట్లాడాడు. ఇద్దరం కలిసి హ్యాట్రిక్ కొట్టిన విషయం వెల్లడించాడు. ఇక ఓ సినిమా తీయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్న ఈ కాలంలో తాము 130 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశామని చెప్పాడు. ముంబైలో ఈ ఈవెంట్ జరగడంతో మహారాష్ట్ర అంతటి నుంచీ ఈ ఈవెంట్ కు బాలయ్య అభిమానులు తరలి వచ్చారు. దీంతో వాళ్లు, అక్కడి మీడియా కోసం అతడు పూర్తిగా హిందీలోనే మాట్లాడాడు.
అఖండ 2 తాండవం సాంగ్ రిలీజ్
అఖండ 2 మూవీ నుంచి ది తాండవం అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ లిరికల్ వీడియో బాలయ్య విశ్వరూపంతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముంబైలోని జుహులో మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.
బాలీవుడ్ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఈ పాట పాడటం విశేషం. శివుడి తాండవం గురించి పవర్‌ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగిపోయింది. ఇందులో అఘోరా లుక్ లో బాలయ్య నటవిశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ పాటలోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచు పర్వతాల్లో షూటింగ్ చేశారు.
అఖండ 2 గురించి..
2021లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లోనే వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. సరిగ్గా నాలుగేళ్లకు ఈ సీక్వెల్ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమాలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కూడా నటిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫస్ట్ సింగ్ తాండవంతో మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


