Balakrishna Sekhar Kammula: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్.. క్లాస్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాస్ పొలిటికల్ థ్రిల్లర్?

Balakrishna Sekhar Kammula: బాలకృష్ణ, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో, అటు అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. క్లాస్, మాస్ కలవడమేంటన్న చర్చ మొదలైంది.

Published on: May 1, 2026, 10:21:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna Sekhar Kammula: బాలకృష్ణ, శేఖర్ కమ్ముల.. అసలు ఈ పేర్లు పక్కపక్కన ఉండటమే ఓ ఆశ్చర్యం. అలాంటిది వీళ్లిద్దరూ కలిసి ఓ మూవీ చేయబోతుండటం మరింత ఆశ్చర్యం కలిగించేదే. ఒకరు క్లాస్ సినిమాల డైరెక్టర్.. మరొకరు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

Balakrishna Sekhar Kammula: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్.. క్లాస్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాస్ పొలిటికల్ థ్రిల్లర్?
Balakrishna Sekhar Kammula: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్.. క్లాస్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాస్ పొలిటికల్ థ్రిల్లర్?

బాలయ్య, కమ్ముల పొలిటికల్ థ్రిల్లర్

బాలకృష్ణ, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుందన్నది ఈ వార్త సారాంశం. ఇప్పటికే సోషల్ మీడియాతోపాటు పలు రిపోర్టులు దీనిని తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచీ అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అసలు బాలయ్య మాస్ ఇమేజ్ కు శేఖర్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు అని. నిజానికి ఇప్పటికే ఓ పవర్ ఫుల్ స్టోరీ కూడా రెడీ అయినట్లు కూడా సమాచారం.

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి యూత్ మెచ్చే సినిమాలతోపాటు లీడర్ లాంటి యువతకు సందేశం ఇచ్చే మూవీస్ కూడా తీసిన శేఖర్ కమ్ముల.. బాలయ్య కోసం మాంచి పొలిటికల్ థ్రిల్లర్ రెడీ చేస్తున్నాడట. అటు బాలయ్య కూడా తన మాస్ ఇమేజీని పక్కన పెట్టి.. సమాజానికి సందేశం ఇచ్చే మూవీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కూడా సమాచారం. గతేడాది నాగార్జున, ధనుష్ లాంటి వాళ్లతో కలిసి కుబేర మూవీతో హిట్ అందుకున్న శేఖర్.. అదే ఊపులో ఇప్పుడు బాలయ్యతో మూవీకి రెడీ అయిపోతున్నాడు.

బాలయ్య వరుస సినిమాలు

బాలకృష్ణ ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ మూవీ షూటింగ్ సాగుతోంది. మరోవైపు మరో మాస్ డైరెక్టర్ కొరటాల శివకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగనుంది. ఈ నేపథ్యంలో సడెన్ గా శేఖర్ కమ్ములతో మూవీ తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే శేఖర్ తనకోసం సిద్ధం చేసిన కథను మెచ్చిన బాలయ్య ఇప్పటికే ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

తన సినిమాల్లో హీరోలను చాలా క్లాస్ గా చూపిస్తూ.. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించే శేఖర్ కమ్ముల.. బాలయ్యలాంటి మాస్ హీరోను ఎలా హ్యాండిల్ చేస్తాడన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే కనుక టాలీవుడ్ లో అదొక సెన్షేషన్ అవుతుంది. నిజానికి మొదట్లో ఆశ్చర్యం కలిగించే కాంబినేషన్లే తర్వాత బ్లాక్‌బస్టర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిది కూడా అలాంటిదే అవుతుందన్న ఆశతో బాలకృష్ణ అభిమానులు ఉన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More