...
...
Next Story

Bandla Ganesh: ఏడాది జైలు శిక్షపై బండ్ల గణేష్ రియాక్షన్ ఇలా.. సుప్రీంకోర్టు వరకు అంటూ.. 8 ఏళ్ల కిందటి చెక్ బౌన్స్ కేసు

Bandla Ganesh: చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను ఖరారు చేసింది. దీనిపై స్పందించిన బండ్ల గణేష్.. తనకు భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని, న్యాయం కోసం పై కోర్టులను ఆశ్రయిస్తానని ప్రకటించారు.

Published on: Nov 19, 2026, 16:17:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు పాత చెక్ బౌన్స్ కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.

Bandla Ganesh: ఏడాది జైలు శిక్షపై బండ్ల గణేష్ రియాక్షన్ ఇలా.. సుప్రీంకోర్టు వరకు అంటూ.. 8 ఏళ్ల కిందటి చెక్ బౌన్స్ కేసు
Bandla Ganesh: ఏడాది జైలు శిక్షపై బండ్ల గణేష్ రియాక్షన్ ఇలా.. సుప్రీంకోర్టు వరకు అంటూ.. 8 ఏళ్ల కిందటి చెక్ బౌన్స్ కేసు

అయితే ఈ తీర్పుపై బండ్ల గణేష్ ఏమాత్రం ఆందోళన చెందకుండా, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, పైకోర్టుల్లో న్యాయపోరాటం చేస్తానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 2024లో కింది కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూ ఒంగోలు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

ఏంటీ ఒంగోలు చెక్ బౌన్స్ కేసు? పూర్తి నేపథ్యం ఇదే

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జె. జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత జానకి రామయ్య మరణించడంతో, బండ్ల గణేష్ ఆ మొత్తానికి గాను ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన ఒంగోలు రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 2024లోనే బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను ఒంగోలు రెండో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించడమే కాకుండా, ఫిర్యాదుదారుడి న్యాయవాద ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవడానికి బండ్ల గణేష్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

"హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తా": బండ్ల గణేష్ ట్వీట్

“భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉన్నాయి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం” అని ఆయన పేర్కొన్నారు.

బండ్ల గణేష్‌కు గతంలోనూ చెక్ బౌన్స్ కేసులు

బండ్ల గణేష్‌కు ఇలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆయనపై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి.

వక్కంతం వంశీ కేసు (2017): జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'టెంపర్' (2015) కథా రచయిత వక్కంతం వంశీ తనకు రావాల్సిన రూ.26 లక్షల రెమ్యూనరేషన్ చెక్కులు బౌన్స్ అయ్యాయని కేసు వేశారు. 2017లో నాంపల్లి (ఎర్రమంజిల్) కోర్టు బండ్ల గణేష్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.16 లక్షల జరిమానా విధించగా, ఆయన వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ పొందారు.

కడప కేసు (2019): కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి వద్ద తీసుకున్న రూ.13 కోట్ల అప్పు విషయంలో చెక్ బౌన్స్ కావడంతో 2019లో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా, 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం రాజీ కుదుర్చుకుని బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఇటీవలే ఆగస్టులో హైదరాబాద్‌లో తన కుమార్తె వివాహాన్ని సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్, ఈ ఏడాది 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రంలో నటించారు. ఇప్పుడు ఒంగోలు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపోరాటంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks