Trisha: తమిళనాడులో విజయ్ పార్టీ జోరు.. కంగ్రాచ్యులేషన్స్ త్రిష.. మీ కలలు నిజమయ్యాయన్న బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. త్రిషను ఉద్దేశించి కలలు నిజమయ్యాయని అతను పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 

Published on: May 4, 2026, 10:41:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha: దేశంలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ షురూ అయింది. ఇందులో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి. స్టార్ హీరో విజయ్ సినిమాలను వదిలి ఎన్నికల్లో పోటీ చేయడమే కారణం. అయితే ఇప్పుడు త్రిష పేరు కూడా మార్మోగుతోంది. దానికో కారణం ఉంది.

త్రిషను ఉద్దేశించి బండ్ల గణేష్ ట్వీట్ (x)
త్రిషను ఉద్దేశించి బండ్ల గణేష్ ట్వీట్ (x)

బండ్ల గణేష్ ట్వీట్

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే ముందంజలో ఉన్న నేపథ్యంలో త్రిషకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ గణేష్ చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ (మే 4) తన బర్త్ డే సందర్భంగా త్రిష ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది.

‘‘కంగ్రాచ్యులేషన్స్ త్రిష. వేంకటేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీ కలలు నిజమయ్యాయి’’ అని బండ్ల గణేష్ సోమవారం ఎక్స్ లో పోస్టు చేశాడు.

మామూలోడివి కాదన్నా

తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో త్రిషను ఉద్దేశించి బండ్ల గణేష్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. నువ్వు మామూలోడివి కాదన్నా, అలా ఎలా పోస్టు పెట్టావ్ అన్నా, ఛాన్స్ వదలవు కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బండ్లన్న గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

టీవీకే ప్రభంజనం

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే 118 స్థానాల్లో విజయం సాధించాలి. టీవీకే దూకుడు చూస్తుంటే విజయ్ సీఎం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్, త్రిష

కొన్ని నెలల నుంచి విజయ్, త్రిష వ్యవహారం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన అతని భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. అప్పటి నుంచి విజయ్, త్రిష మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ పుకార్లకు మరింత బలం చేకూరేలా విజయ్, త్రిష కలిసి ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్ కు జంటగా హాజరయ్యారు. అక్కడి నుంచి విజయ్, త్రిష పేర్లు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే అధికారం దక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి త్రిష పేరు మరోసారి మార్మోగుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More