Telugu OTT: మూడు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన యాటిట్యూడ్ స్టార్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Telugu OTT: యాటిట్యూడ్ స్టార్ అంటూ వివాదాలకు కేరాఫ్ గా నిలిచే చంద్రహాస్ నటించిన మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ మూడు నెలల తర్వాత సైలెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో బోల్తా పడిన ఈ మూవీ.. ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
Telugu OTT: గుంజి గుంజి అంటూ స్టేజ్ పైనే బూతు పాట పాడి దుమారం రేపిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మూడు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది.

బరాబర్ ప్రేమిస్తా ఓటీటీ స్ట్రీమింగ్
బుల్లితెర మెగాస్టార్ గా పేరుగాంచిన ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తెలుగు సినిమాలో తనకు తాను యాటిట్యూడ్ స్టార్ గా చెప్పుకుంటాడు. అతడు నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. శుక్రవారం (మే 8) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. అది కూడా థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఇలా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బరాబర్ ప్రేమిస్తా మూవీ విశేషాలు
టాలీవుడ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగా తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా సినిమాలో చంద్రహాస్‌కు జోడీగా మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా.. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వేరరావు నిర్మించారు. ఈ మూవీలో మురళిధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అర్జున్ మహి, అభయ్ నవీన్, సునిత మనోహర్, కీర్తి లత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇది ఒక గ్రామీణ ప్రేమకథ. ఊరిలో అందరితో సరదాగా ఉండే ఒక కుర్రాడు చందు (చంద్రహాస్), అదే ఊరిలోని ఒక అమ్మాయి బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ)తో ప్రేమలో పడతాడు. అయితే వీరి ప్రేమకు కులం, అంతస్తులు కాకుండా ఊరిలోని కొన్ని గొడవలు అడ్డంకిగా మారతాయి.
ఆ సమస్యలను చందు ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమికురాలిని ఎలా దక్కించుకున్నాడు? అసలు చందు, బుజ్జమ్మ ప్రేమతో ఊరికి వచ్చిన ఇబ్బంది ఏంటీ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
వివాదంతోనే ప్రమోషన్
ఈ సినిమా రిలీజ్ సమయంలో ఓ పెద్ద దుమారమే రేగింది. అప్పట్లో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ ఓ బూతు పాట పాడాడు. గుంజి గుంజి అంటూ సాగిన ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తం బూతులు ఉన్న అలాంటి పాటను పబ్లిగ్గా పాడటమేంటని చాలా మంది విమర్శించారు.
పోలీసులు కేసు కూడా నమోదైంది. ఈ వివాదంతోనే బరాబర్ ప్రేమిస్తా సినిమాకు కాస్త ప్రమోషన్ లభించింది. కానీ థియేటర్లలో రిలీజైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. దీంతో మూవీ పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో అయినా ఆదరణ లభిస్తుందో లేదో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


