బెల్లంకొండ శ్రీనివాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. ఇవాళ (జనవరి 3) అతని బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హైందవ టైటిల్ తో రాబోతున్న ఈ థ్రిల్లర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను గతేడాది జనవరిలో రిలీజ్ చేశారు.
హైందవ పోస్టర్

కిష్కింధపురి సినిమాతో గతేడాది ఎండింగ్ లో హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో కెరీర్ కు కిష్కింధపురి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలనే నమ్ముతూ కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్రమంలోనే హైందవ అంటూ థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. శనివారం అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన హైందవ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
చేతిలో గొడ్డలి
హైందవ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ మోడ్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడాతో పోరాటానికి సిద్ధమన్నట్లు అరుస్తున్నాడు శ్రీనివాస్. వెనుకాల నిప్పుల్లాంటి కళ్లతో వారాహం ఉంది. దాని కొమ్ములు హీరోకే మొలిచినట్లు పోస్టర్ అదిరిపోయింది. హైందవ మూవీలో సంయుక్త హీరోయిన్. ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి డైరెక్టర్.
దశావతారాల అండ
‘‘ఎప్పుడైతే ఓ పవర్ ఫుల్ శక్తి ఏర్పుడుతుందో, అప్పుడు దశావతారాల అండ ఉంటుంది. త్వరలో థియేటర్లలో హైందవ’’ అని హైందవ మూవీ పోస్టర్ కు ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఇదో మైథాలజీ బేస్డ్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. ఈ సినిమాతో బెల్లం అన్న మరో హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మూన్ షైన్ పిక్చర్స్ పై మహేష్ చందు హైందవ సినిమాను నిర్మిస్తున్నాడు.
కిష్కింధపురితో
2014లో పక్కా మాస్ కమర్షియల్ మూవీ అల్లుడు శీనుతో డెబ్యూ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత.. ఇలా వరుసగా సినిమాలు చేసినా అనుకున్నంత హిట్ కాలేదు. అప్పుడే రాక్షసుడు అంటూ రూట్ మార్చి హిట్ అందుకున్నాడు.
{{/usCountry}}2014లో పక్కా మాస్ కమర్షియల్ మూవీ అల్లుడు శీనుతో డెబ్యూ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత.. ఇలా వరుసగా సినిమాలు చేసినా అనుకున్నంత హిట్ కాలేదు. అప్పుడే రాక్షసుడు అంటూ రూట్ మార్చి హిట్ అందుకున్నాడు.
{{/usCountry}}మళ్లీ అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ రీమేక్), భైరవం అంటూ రొటీన్ సినిమాలతో దెబ్బతిన్నాడు బెల్లకొండ. ఆ తర్వాత కిష్కింధపురితో సాలిడ్ హిట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు హైందవతో మరోసారి అదరగొట్టేందుకు వస్తున్నాడు.