Bellamkonda Srinivas: అల్లుడు శీనుగా భార్యతో వచ్చానన్న బెల్లంకొండ శ్రీనివాస్‌-భర్తను కావ్య ప్రేమగా ఏమని పిలుస్తుందంటే?

Bellamkonda Srinivas: అల్లుడు శీను మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ అల్లుడు శీనుగా మారాడు. తన భార్య కావ్యతో ఇంటికి వచ్చిన అతను.. ఇంట్లోకి వెళ్లేముందు పేరు చెప్పమంటే అల్లుడు శీను అని చెప్పాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: May 1, 2026, 06:28:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రేయసి కావ్యరెడ్డిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్నారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి వెళ్లేముందు పేర్లు చెప్పాలి. ఆ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పేర్లు చెప్పిన విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి (x)
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి (x)

నా భర్తతో

‘‘నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను’’ అని కావ్య రెడ్డి క్యూట్ గా చెప్పడంతో అక్కడున్న ఫ్యామిలీ అంతా కేకలు పెడతారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ను చెప్పమంటారు.

కావ్య ముద్దుగా

‘‘మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి’’ అని ఫస్ట్ సరదాగా చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. సరిగ్గా చెప్పాలని అందరూ అడుగుతారు. అప్పుడే తన భర్త బెల్లంకొండ శ్రీనివాస్ ను కావ్య ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలిసిపోయింది. ఆమె తన భర్తను ‘చెప్పు శ్రీని’ అని అడుగుతుంది.

దీంతో.. ‘‘నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను. అల్లుడు శీనుగా వచ్చా’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్తాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అల్లుడు శీనుతో

పాపులర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్నాడు. అతను ‘అల్లుడు శీను’ మూవీతోనే డెబ్యూ చేశాడు. 2014లో వచ్చిన ఈ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ అల్లుడు శీనుగా మారాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్లో అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ), భైరవం, కిష్కింధపురి సినిమాలు చేశాడు.

పెళ్లి గురించి..

చాలా కాలంగా ప్రేమలో మునిగితేలిన బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి తిరుమలలో వీళ్లు వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అటెండ్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ (మే 1) హైదరాబాద్ లో జరుగుతుందని తెలిసింది. ఈ రిసెప్షన్ కు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More