OTT Thrillers: సండే ప్లాన్స్ ఏంటీ? ఓటీటీలో ఈ 7 మైండ్ బ్లాక్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి- వేరే లెవల్ ట్విస్ట్ లు- తెలుగులో!
OTT Thrillers: రేపే సండే. మరి ఓటీటీలో ఏం చూసేందుకు ప్లాన్ చేస్తున్నారు? ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సస్పెన్స్, క్రైమ్, యాక్షన్, మైండ్-బెండింగ్ మలుపులు ఉన్న సినిమాలకు వీక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ ఉంటుంది. వీకెండ్‌లో గూస్ బంప్స్ తెప్పించే ఈ 7 థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి. అసలు డిసప్పాయింట్ అవరు.
OTT Thrillers: ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇధి ఎవర్ గ్రీన్ జోనర్. ఈ జోనర్లో ఎన్ని మూవీస్ చూసినా అసలు బోర్ అన్నదే రాదు. అందుకే అలాంటి మాస్టర్ క్లాస్ అనదగ్గ థ్రిల్లర్ జోనర్ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. మీ సండే ఓటీటీ ఎంటర్ టైన్మెంట్ కు ఇది పర్ఫెక్ట్.

మహారాజ (Maharaja) – నెట్‌ఫ్లిక్స్
విజయ్ సేతుపతి మైలురాయి 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' ఇటీవలి కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్-బెండింగ్ థ్రిల్లర్‌గా నిలిచింది. ఒక సాధారణ బార్బర్ అయిన మహారాజ, తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ‘లక్ష్మి’ అనే ఐరన్ డస్ట్ బిన్ పోయిందని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది.
పోలీసులు దీనిని హాస్యాస్పదంగా తీసుకున్నా, ఆయన మాత్రం పట్టుబడతాడు. ఈ దర్యాప్తు సాగుతున్న కొద్దీ అసలు దొంగతనం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు, క్రూరమైన నేరగాడు సెల్వం (అనురాగ్ కశ్యప్) పాత్ర బయటపడతాయి. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రం గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ట్విస్ట్‌తో ముగుస్తుంది.
విక్రమ్ (Vikram) – జియోహాట్‌స్టార్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మాస్క్డ్ గ్యాంగ్ చేతిలో మాజీ బ్లాక్-ఆప్స్ కమాండర్ కర్ణన్ అలియాస్ విక్రమ్ హతమయ్యాడనే వార్తతో కథ ప్రారంభమవుతుంది.
ఈ మరణాల వెనుక ఉన్న డ్రగ్ సిండికేట్ నెట్‌వర్క్‌ను బ్లాక్-ఆప్స్ ఆఫీసర్ అమర్ (ఫహద్ ఫాజిల్) దర్యాప్తు చేస్తుండగా, ఊహించని విధంగా విక్రమ్ తిరిగి వస్తాడు. అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగే ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో ఒక ట్రెండ్ సెట్టర్. ఓటీటీలో ఎప్పుడైనా చూడగలిగే సినిమా.
ముల్షి ప్యాటర్న్ (Mulshi Pattern) – జీ5
భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలు క్రైమ్ ప్రపంచంలోకి ఎలా వస్తున్నాయనే చేదు నిజాన్ని చూపించే రా అండ్ రస్టిక్ మరాఠీ క్రైమ్ డ్రామా ఇది. తండ్రి తక్కువ ధరకు భూమి అమ్మేయడంతో నగరానికి వలస వచ్చిన రాహుల్ (ఓం భూత్కర్) దారిద్య్రం భరించలేక స్థానిక మాఫియాలో చేరి గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు.
అయితే, అతని ఎదుగుదల ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విఠల్ కోలి (ఉపేంద్ర లిమాయే)తో ఘర్షణకు దారితీస్తుంది. గ్యాంగ్‌స్టర్ పాత్రలను గ్లామరైజ్ చేయకుండా, అత్యంత సహజంగా, సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం పక్కా గ్రిప్పింగ్ వాచ్.
గరుడన్ (Garudan) – అమెజాన్ ప్రైమ్ వీడియో
గ్రామీణ నేపథ్యంలో అధికారం, దురాశ, నమ్మకద్రోహం చుట్టూ తిరిగే పక్కా రివెంజ్ డ్రామా ఇది. చిన్ననాటి స్నేహితులైన ఆది (శశికుమార్), కరుణ (ఉన్ని ముకుందన్) ల కోసం ప్రాణమిచ్చే నమ్మకమైన లాయలిస్ట్ చొక్కన్ (సూరి) చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఒక పురాతన ఆలయ భూమి వివాదం వీరి మధ్య తీవ్రమైన హింసకు, నమ్మకద్రోహానికి దారితీసినప్పుడు చొక్కన్ న్యాయం వైపు నిలబడాలా లేక నమ్మిన స్నేహం వైపు ఉండాలా అనే సందిగ్ధంలో పడతాడు. నటుడు సూరి ఇంటెన్స్ నటన, ఊహించని ట్విస్టులు ఈ చిత్రానికి హైలైట్.
రాక్షసుడు (Rakshasudu) – జీ5
తమిళంలో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'రాక్షసన్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా దర్శకుడు కావాలనుకుని పరిస్థితుల ప్రభావంతో సబ్-ఇన్‌స్పెక్టర్ అయిన అరుణ్, పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్ చేసి దారుణంగా చంపే ఒక సైకో కిల్లర్ కేసును డీల్ చేయాల్సి వస్తుంది.
సైకోలజీ రీసెర్చ్ సాయంతో కిల్లర్ ప్యాటర్న్‌ను పట్టుకునేందుకు అరుణ్ చేసే ప్రయత్నాలు, డిపార్ట్‌మెంట్ రాజకీయాలు, ప్రతి నిమిషం గుండె ఆగిపోయేంత సస్పెన్స్‌తో ఈ చిత్రం సాగుతుంది.
రేగే (Rege) – జీ5
ముంబై అండర్ వరల్డ్, పోలీస్ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సాగే అత్యంత వాస్తవిక నాన్-లీనియర్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక మంచి కుటుంబానికి చెందిన మెడికల్ స్టూడెంట్ అనిరుద్ధ రేగే, క్రేజ్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్ ఎం భాయ్‌కి దగ్గరవుతాడు. సరదాగా మొదలైన ఈ ప్రయాణం ఒక పోలీస్ స్టింగ్‌తో నరకంగా మారుతుంది.
సీనియర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ (మహేష్ మంజ్రేకర్) ఈ యువకుడిని అండర్ వరల్డ్ ఆపరేషన్లలో పావుగా ఎలా వాడుకున్నాడనేది ఇందులో చూపిస్తారు. సాధారణ వ్యక్తులు నేర ప్రపంచంలో ఎలా చిక్కుకుపోతారో చూపించే రియలిస్టిక్ డ్రామా ఇది.
తడమ్ (Thadam) – యూట్యూబ్
ఒక వ్యాపారవేత్త హత్య కేసులో ప్రధాన నిందితుడిగా కవిన్ (అరుణ్ విజయ్) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే, దర్యాప్తులో కవిన్ పోలికలతోనే ఉన్న ఎజిల్ అనే మరో వ్యక్తి బయటకు రావడంతో కేసు పూర్తిగా మలుపు తిరుగుతుంది.
వీరిద్దరిలో అసలు నేరస్థుడు ఎవరనేది కనిపెట్టడానికి లీగల్ అండ్ ఫోరెన్సిక్ లాజిక్స్‌తో సాగే ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. కవలల కాన్సెప్ట్‌లో వచ్చే రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ సాగే ఈ చిత్రం హిందీలో 'గుమ్రా' పేరుతో రీమేక్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


