...
...
Next Story

Bethlehem Kutumba Unit OTT: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో రిలీజైన 200 కోట్ల మలయాళం బ్లాక్‌బస్టర్ రోమ్ కామ్.. ఎప్పుడు, ఎక్కడ?

Bethlehem Kutumba Unit OTT: మలయాళ రోమ్ కామ్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రూ.200 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Sep 4, 2026, 14:37:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Bethlehem Kutumba Unit OTT: మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly), 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఓనమ్ పండగ కానుకగా ఆగస్టు 21న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈరోజే అంటే శుక్రవారం (సెప్టెంబర్ 4) తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.

బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ

Bethlehem Kutumba Unit OTT: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో రిలీజైన 200 కోట్ల మలయాళం బ్లాక్‌బస్టర్ రోమ్ కామ్.. ఎప్పుడు, ఎక్కడ?
Bethlehem Kutumba Unit OTT: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో రిలీజైన 200 కోట్ల మలయాళం బ్లాక్‌బస్టర్ రోమ్ కామ్.. ఎప్పుడు, ఎక్కడ?

'ప్రేమలు' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ గిరీష్ ఏడీ తెరక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం 14 రోజుల్లోనే ఇండియాలో రూ. 102.15 కోట్ల నెట్ (రూ. 119.25 కోట్ల గ్రాస్) సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 112 కోట్లు రాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 231.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను తిరగరాసింది.

రెండో వారంలో కూడా థియేటర్లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నైట్ షోలకు ఏకంగా 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రావడం ఈ సినిమా క్రేజ్ ఏంటో చెప్తోంది.

ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) భారీ ధరకు సొంతం చేసుకుంది. సినిమా ప్రారంభ క్రెడిట్స్‌లోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత జియోహాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ స్టోరీ, ఎలా ఉందంటే?

జస్టిన్ పాత్రలో నివిన్ పౌలీ తన మార్క్ టైమింగ్‌తో నవ్వించగా, ఆష్లీగా మమితా బైజు క్యూట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు విష్ణు విజయ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. రొమాంటిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఓటీటీలో ఈ చిత్రం బెస్ట్ వాచ్‌గా నిలవడం ఖాయం.

మమితా బైజుకు నెల రోజుల గ్యాప్ లో మూడో రూ.200 కోట్ల మూవీ ఇది. అంతకుముందు జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో ఈ ఘనత సాధించిన మమితా.. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ తో హ్యాట్రిక్ సాధించి ఇండియాలనే తొలి హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe