Bhartha Mahasayulaku Wignyapthi OTT: అఫీషియల్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఈవారమే స్ట్రీమింగ్
Bhartha Mahasayulaku Wignyapthi OTT: రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈవారమే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ విశేషాలు చూడండి.
రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ముగిసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని జీ5 ఓటీటీ సోమవారం (మార్చి 9) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈవారమే స్ట్రీమింగ్
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. ఇప్పటికే అన్ని సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా.. మొత్తానికి ఈ శుక్రవారం (మార్చి 13) నుంచి రవితేజ నటించిన ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది.
“నిరీక్షణ ముగిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ వచ్చేసింది. మార్చి 13న జీ5లో స్ట్రీమింగ్” అవుతుంది అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఒక నిమిషం 10 సెకన్లు ఉన్న మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అసలు కథేంటంటే?
ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరున్న కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రవితేజ ఒక సంపన్న వ్యాపారవేత్తగా నటించాడు. వ్యాపార పనుల మీద తరచుగా యూరప్ వెళ్లే హీరో.. అక్కడ ఒక యువతి ప్రేమలో పడతాడు.
ఆ పరిచయం వల్ల తన వైవాహిక జీవితంలో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ఎమోషనల్ జర్నీ నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించాడు.
ఆకట్టుకున్న సంగీతం.. ఆశిక, డింపుల్ జోరు
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. రవితేజ మార్క్ కామెడీ, ఎమోషనల్ డ్రామాను ఇష్టపడేవారు మార్చి 13 నుంచి జీ5లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'ని ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సినిమాతోపాటు ఈవారం ఓటీటీలోకి ఫంకీ, నవాబ్ కేఫ్ లాంటి తెలుగు సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


