Bhogi Egilivaranga Song: భోగి నుంచి ఎగిలివారంగా సాంగ్ రిలీజ్.. పల్లె వాతారణం, మనసుకు హత్తుకునే జానపదం

Bhogi Egilivaranga Song: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న భోగి మూవీ నుంచి ఎగిలివారంగా సాంగ్ రిలీజైంది. పల్లె వాతావరణం, జానపదం కలగలసిని ఈ పాట మనసుకు హత్తుకునేలా సాగింది.

Published on: Oct 9, 2026, 16:09:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bhogi Eglivaranga Song: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతార్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో అదరగొట్టగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్.

Bhogi Egilivaranga Song: భోగి నుంచి ఎగిలివారంగా సాంగ్ రిలీజ్.. పల్లె వాతారణం, మనసుకు హత్తుకునే జానపదం
Bhogi Egilivaranga Song: భోగి నుంచి ఎగిలివారంగా సాంగ్ రిలీజ్.. పల్లె వాతారణం, మనసుకు హత్తుకునే జానపదం

సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఎగిలి వారంగా' పాటను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో 1960ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఈ పాటలో ఆవిష్కరించారు.

గ్రామీణ జీవనం, పటేల్ వ్యవస్థ ప్రతిబింబించేలా సాహిత్యం

భోగి మూవీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ ఎగిలి వారంగా తొలిసారి వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట ఆరంభం నుంచే ఒక అచ్చమైన పల్లెటూరి అనుభూతిని ఇస్తుంది. ఊరి ప్రజల రోజువారీ కష్టం, వారి వృత్తులు, కుటుంబ బంధాలు, అప్పటి కాలంలో పటేల్ వ్యవస్థ పట్ల గ్రామస్తులు చూపించే గౌరవం, అదే సమయంలో రాచరిక దౌర్జన్యాలు ఎలా ఉండేవో పాటలో చాలా సహజంగా చూపించారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నాటు పల్లెటూరి గెటప్స్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయారు.

పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం అతిపెద్ద అసెట్ అని చెప్పాలి. పదాల కూర్పుతో పల్లె అందాలను, గ్రామస్తుల మనస్తత్వాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఫోక్ బీట్స్ అందించడంలో స్పెషలిస్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మరోసారి తన మార్క్ మాస్ ట్యూన్ తో ఆకట్టుకున్నారు.

జానపద గాయకుల ఎనర్జీ.. నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్

నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. పక్కా లోకల్ జానపద శైలిలో సాగే ఈ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సంపత్ నంది మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తుండగా, ఈ యాక్షన్ డ్రామాను నవంబర్ 12, 2026న థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పాటతోనే భోగి ఆల్బమ్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More