హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
Bhogi Twitter Review: భోగి మూవీకి దారుణమైన రివ్యూలు.. శర్వానంద్ కష్టం వృథా అయిందా.. రంగస్థలం రేంజ్ అనుకుంటే రక్తపాతమే!
Bhogi Twitter Review: శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామా 'భోగి' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోల నుంచి దారుణమైన రివ్యూలు వస్తున్నాయి. శర్వా నటనను ప్రశంసిస్తున్నా ఓవరాల్ గా మూవీ దారుణంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Bhogi Twitter Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) తొలిసారిగా పూర్తిస్థాయి మాస్, రస్టిక్ అవతారంలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' థియేటర్లలోకి అడుగుపెట్టింది. సంపత్ నంది దర్శకత్వంలో, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు.

1962 నాటి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం నేపథ్యంలో, పటేల్ అరాచకాలకు వ్యతిరేకంగా గంగ (శర్వానంద్) చేసే తిరుగుబాటు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ట్విటర్ (X) వేదికగా ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ, నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి.
శర్వానంద్ కష్టం బాగున్నా.. కథనం గాడి తప్పిందంటున్న నెటిజన్లు
భోగి సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు, ఓవర్సీస్ రివ్యూయర్ల అభిప్రాయం ప్రకారం 'భోగి'లో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్లు ఇలా ఉన్నాయి.
శర్వానంద్ వన్-మ్యాన్ షో: సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కేవలం శర్వానంద్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమేనని నెటిజన్లు ఏకగ్రీవంగా చెబుతున్నారు. గంగ పాత్ర కోసం ఆయన పడిన కష్టం, తెలంగాణ యాస, పోరాట సన్నివేశాల్లో చూపిన ఎనర్జీ ఆకట్టుకుందని కొందరు మాస్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
రక్తపాతం ఎక్కువైంది.. ఎమోషన్ మిస్ అయింది: 'రంగస్థలం' తరహాలో ఒక రా అండ్ రస్టిక్ కథను అందించాలని దర్శకుడు సంపత్ నంది ప్రయత్నించినప్పటికీ, ఆ స్థాయి సహజత్వం, బలమైన భావోద్వేగాలు పండలేదని విమర్శకులు పేర్కొంటున్నారు. ఒక దశ తర్వాత అసలు ఆ హింస, రక్తపాతం ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని, అనవసరమైన హింస ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడుతున్నారు.
చెవులు చిల్లులు పడే బీజీఎం, సాగదీసిన సెకండాఫ్: భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎం సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి బదులు, విపరీతమైన శబ్దంతో చెవులకు ఇబ్బంది కలిగించిందని పలువురు రివ్యూయర్లు అసహనం వ్యక్తం చేశారు. పాటలు కూడా గుర్తుండిపోయేలా లేవని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో అసలు కథ ప్రారంభం కావడానికే చాలా సమయం తీసుకోవడం, సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడం, క్లైమాక్స్‌ను విపరీతంగా సాగదీయడం పెద్ద మైనస్‌గా మారాయి.
హీరోయిన్లకు ప్రాధాన్యత లేదా?
ఈ సినిమాలో ఐదుగురు అక్కాచెల్లెళ్ల ఎమోషన్ చూపించాలని ప్రయత్నించినా, అందులో ఒక్కరికి మాత్రమే సరిగ్గా డైలాగులు ఉన్నాయని, మిగతా పాత్రలు తేలిపోయాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అంతేకాకుండా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదని, వారి సన్నివేశాలు తొలగించినా సినిమాకు వచ్చే నష్టమేమీ లేదని కొందరు విశ్లేషకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. అయితే కొందరు మాస్ ప్రేక్షకులు మాత్రం డింపుల్ హయాతి పాత్ర పర్వాలేదని, శర్వానంద్ మాస్ యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఎందుకీ రక్తపాతం అంటూ..
మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు ఎందుకు ఇలాంటి రక్తపాతంతో కూడిన సినిమాల వెంట పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దర్శకుడు సంపత్ నంది గతంలో తీసిన 'సీటీమార్' (Seetimaarr) సినిమాలో మంచి సందేశం, కంటెంట్ ఉండేదని, కానీ 'భోగి' విషయంలో ఆయన జడ్జిమెంట్ పూర్తిగా తప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సినిమాటోగ్రఫీ, 1960ల నాటి పీరియాడిక్ ఆర్ట్ వర్క్ బాగున్నప్పటికీ, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా 'భోగి' బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

E-Paper
