...
...
Next Story

Bhooth Bangla Collection: మండే పరీక్ష పాసైన హారర్ కామెడీ మూవీ- భూత్ బంగ్లాకు 4 రోజుల్లో 77 కోట్ల కలెక్షన్స్!

Bhooth Bangla Box Office Collection Day 4: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, అత్యంత కీలకమైన సోమవారం నాడు కూడా గట్టిగానే నిలబడటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Published on: Apr 21, 2026, 09:13:53 IST
Advertisement

Bhooth Bangla 4 Days Box Office Collection: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ ద్వయం నుంచి వచ్చిన సినిమా కావడంతో 'భూత్ బంగ్లా'పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ, తొలిరోజే రూ. 12.25 కోట్ల కలెక్షన్స్‌తో ఓపెనింగ్ సాధించింది.

అసలైన పరీక్ష

మండే పరీక్ష పాసైన హారర్ కామెడీ మూవీ- భూత్ బంగ్లాకు 4 రోజుల్లో 77 కోట్ల కలెక్షన్స్!
మండే పరీక్ష పాసైన హారర్ కామెడీ మూవీ- భూత్ బంగ్లాకు 4 రోజుల్లో 77 కోట్ల కలెక్షన్స్!

శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగి, భూత్ బంగ్లా సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లాయి. అయితే, ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మొదటి సోమవారం (ఫస్ట్ మండే). ఈ పరీక్షలో అక్షయ్ కుమార్ పాస్ మార్కులు కొట్టేశారనే చెప్పాలి.

నాలుగో రోజు అంటే సోమవారం (ఏప్రిల్ 20) నాడు భూత్ బంగ్లా చిత్రం భారత్ వ్యాప్తంగా రూ. 6.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. సాధారణంగా వీకెండ్ తర్వాత కలెక్షన్లలో 50 శాతం కంటే ఎక్కువ తగ్గుదల కనిపిస్తుంది. కానీ ఈ సినిమా నిలకడగా రాణించడం విశేషం. ఇప్పటివరకు భూత్ బంగ్లా సినిమాకు 4 రోజుల్లో భారత్‌లో వచ్చిన నెట్ కలెక్షన్స్ రూ. 64.75 కోట్లకు చేరుకోగా, గ్రాస్ పరంగా రూ. 77.34 కోట్లను కొల్లగొట్టింది.

ప్రియదర్శన్ మార్క్ కామెడీ.. వింటేజ్ వైబ్స్

'హేరా ఫేరి', 'భూల్ భులయా' వంటి క్లాసిక్ సినిమాల తర్వాత అక్షయ్-ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ పాత అక్షయ్‌ను చూసినట్లు ఫీల్ అవుతున్నారు. లండన్‌లో ఉండే అర్జున్ (అక్షయ్ కుమార్) తన సోదరి (మిథిలా పాల్కర్)కి వారసత్వంగా వచ్చిన ఒక పాత రాజప్రసాదం కోసం ఇండియాలోని మంగళపూర్‌కు వస్తాడు.

"భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు చూడని రీతిలో ఈ హారర్ సినిమాను ప్రియదర్శన్ అద్భుతంగా తెరకెక్కించారు. స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా ఉంది" అని నటుడు పరేశ్ రావల్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

స్టార్ కాస్టింగ్ ప్లస్ పాయింట్

ఈ సినిమాలో కేవలం అక్షయ్ మాత్రమే కాకుండా టబు, వామికా గబ్బి, రాజ్‌పాల్ యాదవ్, జిషూ సేన్‌గుప్తా వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు కలిసొచ్చింది. ముఖ్యంగా రాజ్‌పాల్ యాదవ్ కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది.

బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. భూత్ బంగ్లా రివ్యూలు మిశ్రమంగా వచ్చినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ఈ వారం ముగిసేసరికి సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks