...
...
Next Story

Bhooth Bangla Trailer: మరో హారర్ కామెడీ రెడీ.. భూత్ బంగ్లా ట్రైలర్ వచ్చేసింది.. నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్ కుమార్, టబు

Bhooth Bangla Trailer: అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' ట్రైలర్ విడుదలైంది. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ కామెడీ టైమింగ్‌తో పాటు టబు అదిరిపోయే క్యామియో రోల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Published on: Apr 6, 2026, 15:54:35 IST
Written by , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ద్వయం అంటేనే బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 6) విడుదలైంది. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. ఒకప్పటి సూపర్ హిట్ 'భూల్ భూలయ్యా' రోజులను గుర్తు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

హారర్ అండ్ కామెడీ మిక్స్..

Bhooth Bangla Trailer: మరో హారర్ కామెడీ రెడీ.. భూత్ బంగ్లా ట్రైలర్ వచ్చేసింది.. నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్ కుమార్, టబు
Bhooth Bangla Trailer: మరో హారర్ కామెడీ రెడీ.. భూత్ బంగ్లా ట్రైలర్ వచ్చేసింది.. నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్ కుమార్, టబు

ఒక పల్లెటూరిలోని శాపగ్రస్తమైన పాత బంగ్లా నేపథ్యంలో భూత్ బంగ్లా మూవీ కథ సాగుతుంది. ఆ బంగ్లాలో ఏదో అతీత శక్తి ఉందని, అక్కడికి వెళ్లవద్దని అందరూ హెచ్చరిస్తున్నా.. "ఇంత పెద్ద బంగ్లాను వదిలేసి వెళ్లడానికి నేను పిచ్చోడిని కాదు" అంటూ అక్షయ్ కుమార్ చేసే సందడి ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్షయ్ మార్క్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ తోడై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

పాత టీమ్.. కొత్త జోష్..

ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. అక్షయ్‌తో పాటు పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి కామెడీ దిగ్గజాలు మళ్లీ ఒక్కటయ్యారు. వీరంతా కలిసి చేసే అల్లరి 'హేరా ఫేరి' సినిమాలను గుర్తుకు తెస్తోంది.

అంతేకాకుండా గతేడాది మరణించిన ప్రముఖ నటుడు అస్రానీ ఈ సినిమాలో కనిపించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అతని మరణానంతరం విడుదలవుతున్న సినిమాల్లో ఇదీ ఒకటి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

టబు సర్‌ప్రైజ్ ఎంట్రీ

ఈ భూత్ బంగ్లా ట్రైలర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం నటి టబు ఎంట్రీ. సినిమా అంతా ఒక ఎత్తైతే, టబు క్యామియో రోల్ సినిమాకు వెన్నెముక అని దర్శకుడు ప్రియదర్శన్ ఇదివరకే పేర్కొన్నారు. వామికా గబ్బి, మిథిలా పాల్కర్ ఇతర కీలక పాత్రల్లో నటించగా.. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

భూత్ బంగ్లా విడుదల ఎప్పుడు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "అక్షయ్ - ప్రియదర్శన్ - పరేష్ రావల్ - రాజ్‌పాల్ యాదవ్.. బాలీవుడ్ కామెడీని కాపాడటానికి అసలైన టీమ్ తిరిగి వచ్చింది" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks