...
...
Next Story

Vishnupriya: ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధ‌న‌గ్న ఫొటోలు-స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో బోల్డ్ షో-విష్ణుప్రియ‌కు షాక్‌- పోలీసులకు ఫిర్యాదు

Vishnupriya: హాట్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనికి బిగ్ షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధ‌న‌గ్న ఫొటోలు పోస్తు చేస్తుందని, స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పేరుతో బోల్డ్ షో చేస్తుందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published on: Apr 12, 2026, 10:35:15 IST
Advertisement

Vishnupriya: బోల్డ్ ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న హాట్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనికి బిగ్ షాక్ తగిలింది. అర్ధనగ్న ఫొటోలతో యువతను పెడదారి పట్టిస్తుందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందింది. స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పేరుతో బోల్డ్ షో చేస్తుందని విష్ణుప్రియపై ఫైర్ అవుతున్నారు.

విష్ణుప్రియపై పోలీస్ ఫిర్యాదు

విష్ణుప్రియ
విష్ణుప్రియ

ఇన్‌స్టాగ్రామ్‌ లో హాట్ షోతో రెచ్చిపోతున్న విష్ణుప్రియ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విజయవాడలోని సూర్యారావుపేటలోని సైబర్ క్రైం పోలీసులకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.

అర్ధనగ్న ఫొటోలు

ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. అంతే కాకుండా తను ఎక్స్ పోజ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌ చేసుకోవాలని ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. డబ్బులకు ఆశపడి అర్ధనగ్న వీడియోలు చేస్తుందని విమర్శించారు.

బ్లాక్ చేయాలని

విష్ణుప్రియపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ లీడర్లు పోలీసులను కోరారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ను బ్లాక్ చేయాలని, తనపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని ఫిర్యాదు చేశారు. షోలో నవ్వించే విష్ణుప్రియ, ఇలా డబ్బు కోసం దిగజారడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు.

స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పేరుతో

గతంలో ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేవాళ్లు. అయితే స‌బ్‌స్క్రిప్ష‌న్‌ అనే ఆప్షన్ రావడంతో కొంతమంది డబ్బుల కోసం ఎక్స్ క్లూజివ్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తారు. వీటిని కేవలం సబ్ స్క్రైబర్లు మాత్రమే చూడొచ్చు. విష్ణుప్రియ అకౌంట్ కు 1892 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. స‌బ్‌స్క్రిప్ష‌న్‌ కోసం నెలకు రూ.399 కట్టాల్సి ఉంటుంది.

విష్ణుప్రియ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ‘పోవే పోరా’ షోతో పాపులర్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలతో మరింత క్రేజ్ దక్కించుకుంది. అనంతరం బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఇందులో పృథ్వీ శెట్టితో లవ్ ట్రాక్ నడిపింది. బయటకు వచ్చిన తర్వాత కూడా విష్ణుప్రియ, పృథ్వీ శెట్టి క్లోజ్ గానే ఉంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe