Mangli: సింగర్ మంగ్లీకి షాక్.. ఆమెపై పోలీస్ కేసు.. రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసం.. కేసు వాపస్ కోసం డబ్బు ఆఫర్!
Mangli: స్టార్ సింగర్ మంగ్లీకి పెద్ద షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Mangli: వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ తో తన పాపులారిటీని అమాంతం పెంచుకుంటూ సాగుతున్న సింగర్ మంగ్లీని వివాదాలు కూడా వీడటం లేదు. ఆమె పేరు తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. తాజాగా మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. మోసం చేసిందనే ఆరోపణలే అందుకు కారణం.

మంగ్లీపై పోలీస్ కేసు
సింగర్ మంగ్లీపై పోలీస్ కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ పేరుతో రూ.10 కోట్ల మోసం చేశారని లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ లాయర్ ఆరోపించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు మంగ్లీపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె బ్రదర్, మరో ముగ్గురిపైనా కేసు ఫైల్ చేశారు.
ఏమైందంటే?
మంగ్లీపై పోలీస్ కేసు బుక్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ తో ఎక్కువ లాభాలు వస్తాయని మంగ్లీ, ఆమె బ్రదర్ సహా మరి కొంతమంది మొదట హేమకాంత్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, తిరుమల్ తదితరులను కలిశారు. రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టించారు. కానీ ఆ తర్వాత తమను మోసం చేశారని హేమకాంత్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బుతో పరారయ్యారని, తమకు న్యాయం చేయాలని గోడు వ్యక్తం చేస్తున్నారు.
లాయర్ ను కలిసి
హేమకాంత్, మధుసూధన్, తిరుమల్ తదితరులు వెళ్లి సికింద్రాబాద్ లోని లాయర్ సుబ్బారావును కలిసి తమకు జరిగిన మోసం గురించి చెప్పారు. గోకులానందన ఇన్ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడి పెట్టించి, అధిక లాభాలు అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దాదాపు 150 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పరారైనట్లు తెలిపారు.
మంగ్లీ ఆఫర్
ఈ చీటింగ్ కేసు విషయంలో రీసెంట్ గా మంగ్లీతో లాయర్ సుబ్బారావు మాట్లాడారు. ఈ మోసం గురించి అడిగితే మంగ్లీ చాలా అవమానించేలా మాట్లాడిందని, తన ప్రొఫెషన్ ను కించపరిచిందని సుబ్బారావు తెలిపారు. అంతే కాకుండా కేసు వెనక్కి తీసుకునేందుకు తనకు డబ్బులు కూడా ఆఫర్ చేసినట్లు వెల్లడించాడు.
డబ్బుకు తాను లొంగకపోవడంతో తనను బెదిరిస్తున్నారని సుబ్బారావు ఆరోపించారు. దీంతో అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్ని వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగ్లీతో పాటు ఇతరులపైనా కేసు బుక్ చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఇప్పుడు మంగ్లీపై పోలీస్ కేసు నమోదు చేశారనే విషయం సంచలనంగా మారింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


