KD Song: పాటలో బూతులు- పైట జారూస్తూ స్టెప్పులు- మంగ్లీ పాడిన కేడీ మూవీ సాంగ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు- ఇంత నీచ‌మా అంటూ!

KD Song: పాట లిరిక్స్ లో బూతులు, డ్యాన్స్ లో అసభ్యకరమైన స్టెప్పులు ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి. తాజాగా కన్నడ మూవీ ‘కేడీ ది డెవిల్’ నుంచి రిలీజ్ అయిన ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట మరీ అసభ్యంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.  ఈ స్పెషల్ సాంగ్ లో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. మంగ్లీ పాడింది. 

Published on: Mar 16, 2026, 13:52:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కన్నడ మూవీ ‘కేడీ ది డెవిల్’ నుంచి వచ్చిన కొత్త సాంగ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందీలో ‘సర్కే చునార్ తేరి సర్కే’ అని సాగుతున్న ఈ పాటలో లిరిక్స్, స్టెప్పులపై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. పాటలో బూతులు ఉన్నాయని, డ్యాన్స్ అసభ్యకరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

సాంగ్ వీడియోలో నోరా ఫతేహి (youtube)
సాంగ్ వీడియోలో నోరా ఫతేహి (youtube)

సర్కే చునార్ తేరి సర్కే సాంగ్

కేడీ ది డెవిల్ మూవీలో నుంచి రిలీజైన సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ కాంట్రవర్సీకి దారితీసింది. ఇందులో నోరా ఫతేహి వల్గర్ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో సంజయ్ దత్ కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ ఈ పాట పాడింది.

పైట జారుస్తూ

సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ లో నోరా ఫతేహి పైట జారుస్తూ డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదేం డ్యాన్స్, ఇంత నీచమా? అంటూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. యూట్యూబ్ లో సాంగ్ వీడియో కింద కామెంట్లలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

లిరిక్స్

పాట లిరిక్స్ లో బూతులే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. పాటలోని ఫస్ట్ లైన్ శృంగారాన్ని వర్ణిస్తుందని, అమ్మాయి జననేంద్రియాల గురించి చెప్తున్నట్లు ఉందని ఫైర్ అవుతున్నారు. ఈ పాటను మంగ్లీ పాడగా, రఖీబ్ ఆలమ్ సాహిత్యం అందించారు, అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్.

"అశ్లీలత అగ్రస్థానంలో ఉంది", "లిరిక్స్ చాలా చౌకగా, అసభ్యంగా ఉన్నాయి", "ఇదేమిటి? ఇది 2026. ఇప్పటికీ ఇలాంటి పాటలు, డ్యాన్స్ లు?’’ అని నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తీవ్రంగా మండిపడుతున్నారు. పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగులో బెటర్

కేడీ ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ తెలుగులోనూ రిలీజ్ అయింది. ‘జరిపేయ్ నాతో పండగ జరిపేయ్’ అంటూ తెలుగు సాంగ్ సాగుతుంది. దీన్ని చంద్రబోస్ బెటర్ గా రాశారు. దీంతో కన్నడ అభిమానులు చంద్రబోస్ కు థ్యాంక్స్ చెప్తున్నారు. కన్నడలో, హిందీలో సాంగ్ బూతులతో నిండిపోయిందని, తెలుగులో చక్కగా రాసిన చంద్రబోస్ కు ధన్యవాదాలు అని కామెంట్లు పెడుతున్నారు.

కేడీ ది డెవిల్ గురించి

కేడీ: ది డెవిల్ అనేది 2026లో విడుదల కానున్న కన్నడ భాషా యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనికి ప్రీమ్ దర్శకత్వం వహించాడు. ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రీష్మా నానయ్య తదితరులు నటించారు. 1970ల నేపథ్యంలో సాగే అండర్ వరల్డ్‌ కథ ఇది. ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More