Varalakshmi: కథను మానభంగం చేశారన్న రైటర్ సాయి మాధవ్.. రేప్ అని ఎలా అంటారు.. వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్.. కాంట్రవర్సీ
Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ కు కోపమొచ్చింది. రైటర్ సాయి మాధవ్ బుర్రాపై ఆమె ఫైర్ అయింది. కథను రేప్ చేశారని ఎలా అంటారంటూ వరలక్ష్మి ప్రశ్నించింది. ఆమె తాజాగా దర్శకత్వం వహించిన సరస్వతి మూవీ కథ విషయంలో వివాదం తలెత్తింది.
వరలక్ష్మి శరత్ కుమార్ కు కోపమొచ్చింది. పాపులర్ స్టోరీ రైటర్ సాయి మాధవ్ బుర్రాపై ఆమె ఫైర్ అయింది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల 'ఎస్. సరస్వతి' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమెతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

సాయి మాధవ్ బుర్రా స్టోరీ
ఎస్.సరస్వతి సినిమాకు ముందు పాపులర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్టోరీ అందించాడు. కానీ ఈ స్టోరీ నచ్చకపోవడంతో వరలక్ష్మి దీన్ని మార్చింది. స్టోరీ మార్చడంపై సాయి మాధవ్ బుర్రా అసహనం వ్యక్తం చేశాడు. తీవ్రమైన మాటలు జారాడనే విమర్శలు వస్తున్నాయి.
"ఇది నా కథతో మొదలై మరో కథతో ముగుస్తుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’’ అని ఓ ఫేస్ బుక్ పోస్టులో సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నాడు.
వరలక్ష్మి ఫైర్
తాజాగా హైదరాబాద్ లో సరస్వతి మూవీ టీమ్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సాయి మాధవ్ బుర్రా కామెంట్లపై వరలక్ష్మిని రిపోర్టర్ ప్రశ్నించాడు. రచయితను సీనియర్‌గా గౌరవిస్తున్నానని, అయితే కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందో వరలక్ష్మి వివరించింది. అంతేకాకుండా కథను తిరిగి రాయడానికి తనతో చర్చించడానికి రచయితకు సమయం లేదని, అతను 'పెద్ద సినిమాలతో' బిజీగా ఉన్నారని వరలక్ష్మి తెలిపింది.
రేప్ అని అంటారా?
"ఇంత సున్నితమైన విషయంలో 'రేప్' అనే పదాన్ని ఉపయోగించడం కరెక్ట్ కాదు. అలా ఎలా అంటారు. అది కూడా ఆయనలాంటి వ్యక్తి నుంచి రావడం సరికాదు. మీరు ఏ పదం వాడుతున్నారో మీకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా సినిమాలో మీరు చర్చించిన అంశాన్ని బట్టి మీరు వాడే పదాల విషయంలో జాగ్రత్త వహించాలి. కథ కోసం నేనే కష్టపడ్డా. కానీ గౌరవం కోసం క్రెడిట్స్ ఆయనకు ఇచ్చా" అని వరలక్ష్మి మండిపడింది.
కథ మార్చాలని
ఈ కథను ఆరేళ్లుగా సాయి మాధవ్ బుర్రా దగ్గరే ఉంచుకున్నారని వరలక్ష్మి వెల్లడించింది. కథ బాగుంటే ఇప్పటికే సినిమా తీసేవాళ్లు కదా అని ప్రశ్నించింది. ‘‘కథ విన్నప్పుడే కాస్త మార్చాల్సి ఉంటుందని చెప్పా. క్లైమాక్స్ పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చింది. స్టోరీ మార్పు గురించి ఆయనకు చెప్తామంటే అసలు దొరకలేదు’’ అని వరలక్ష్మి తెలిపింది.
తప్పిపోయిన తన 12 ఏళ్ల కూతురి కోసం వెతుకుతున్న తల్లి కథను సరస్వతి సినిమాలో చూపించారు. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


