With Love OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. మనసును తాకే ప్రేమ కథ.. తెలుగులోనూ!
With Love OTT: మనసును తాకే ప్రేమ కథతో థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన తమిళ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేయండి.
ఓటీటీలోకి ఇవాళ ఓ తమిళ సినిమా వచ్చేసింది. థియేటర్లలో అదరగొట్టి, సూపర్ హిట్ గా నిలిచిన రొమాంటిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అదే.. ‘విత్ లవ్’ మూవీ. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు (మార్చి 3) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

విత్ లవ్ ఓటీటీ
రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన తమిళ సినిమాల్లో ‘విత్ లవ్’ ఒకటి. మనసుకు హత్తుకునే లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. మంగళవారం నుంచి డిజిటల్ ప్రేక్షకుల మనసులు దోచేందుకు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. విత్ లవ్ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
తెలుగులోనూ
తమిళ సూపర్ హిట్ మూవీ ‘విత్ లవ్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని మన ఆడియన్స్ కూడా చూసేయచ్చు. విత్ లవ్ సినిమా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్ డెబ్యూ చేసింది.
నెల రోజుల్లోపే
విత్ లవ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ లాంటి మంచి సినిమాను అందించిన దర్శకుడు అభిషన్ జీవింత్ ఈ విత్ లవ్ మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. మధన్ డైరెక్టర్. రజనీకాంత్ కూతురు సౌందర్య తో పాటు నజ్రత్, మగేష్ ఈ మూవీని నిర్మించారు.
విత్ లవ్ స్టోరీ
పెళ్లి వయసుకు వచ్చిన ఓ అబ్బాయి, అమ్మాయి తిరిగి స్కూల్ డేస్ కు వెళ్లడం, పాఠశాల రోజుల్లో ప్రేమించిన వ్యక్తులను కలవాలనుకోవడం చుట్టూ విత్ లవ్ మూవీ సాగుతోంది. సత్య (అభిషన్ జీవింత్)కు వాస్తుపై మంచి పట్టు ఉంటుంది. అయితే అతణ్ని పెళ్లి చేసుకోమ్మని ఫ్యామిలీ ఫోర్స్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మోనీషా (అనస్వర రాజన్)ను కలిసేందుకు వెళ్తాడు.
ఆ ట్విస్ట్
పెళ్లి చూపుల కోసం సత్య, మోనీషా కలుస్తారు. మాటల మధ్యలో వాళ్లు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నట్లు తెలుస్తుంది. పాఠశాల కబుర్లు చెప్పుకున్న సత్య, మోనీషా తిరిగి స్కూల్ కు వెళ్లాలని అనుకుంటారు.
పాఠశాల రోజుల్లో సత్యకు ఓ అమ్మాయితో, మోనీషాకు ఓ అబ్బాయితో లవ్ స్టోరీ ఉంటుంది. మరి సత్య, మోనీషా తిరిగి తమ చిన్నప్పటి ప్రేమికులను కలుసుకున్నారా? లేదా వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అన్నది విత్ లవ్ మూవీ స్టోరీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


