OTT Release: తెలుగు ఫ్యాక్షన్ డ్రామా దేవగుడి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రఘు కుంచె మూవీని ఇక్కడ చూడండి
తెలుగు మాస్ ఫ్యాక్షన్ డ్రామా 'దేవగుడి' ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. అభినవ్ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా 'దేవగుడి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) దక్కించుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. మంగళవారం (మార్చి 3) నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

దేవగుడి స్టోరీ, ఇతర విశేషాలు
బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దేవగుడి సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ కుటుంబం, వారి ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ ప్రధానాంశం.
వీరారెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ధర్మ, ఆ కుటుంబాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడాడు? రాఘవ రెడ్డితో ధర్మకు ఉన్న అనుబంధం ఎటువంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథను మలిచారు.
ఈ సినిమాలో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు రఘు కుంచె గురించే. నటుడిగా మారిన అతడు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. రఘు కుంచె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ రొటీన్ ఫ్యాక్షన్ డ్రామాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచాయని విమర్శకులు పేర్కొన్నారు.
కుల వ్యవస్థపై వచ్చిన మూవీ
కుల వ్యవస్థపై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రధానంగా కులం చుట్టూ తిరిగే కథలో వచ్చే సినిమాల్లో కోర్ పాయింట్ తెలిసేలా ఉంటుంది. అయితే, తెలిసిన విషయాన్ని ఎంత గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకుడికి అంత కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో దేవగుడి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.
సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బంధం పెరుగుతూ వస్తుంది.
ఓటీటీలో క్లిక్ అవుతుందా?
ఇటీవల 'శ్రీ చిదంబరం గారు' వంటి చిన్న సినిమాలు థియేటర్లలో కనుమరుగైనప్పటికీ, ఓటీటీలోకి వచ్చాక మంచి వ్యూస్‌ను సాధించాయి. గ్రామీణ నేపథ్యం, యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన 'దేవగుడి' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 3 నుంచి సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


