వేల కోట్లు మోసం చేసినవారిని వదిలేసి వారిపై ప్రతాపం చూపిస్తుంది- వేశ్య, క్రిమినల్ లవ్ స్టోరీ: కాక్రోచ్ దర్శకుడు సునీల్
తెలుగులో డార్క్ వయోలెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా కాక్రోచ్. జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన కాక్రోచ్ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కాక్రోచ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మార్చి 6న రిలీజ్
"కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాక్రోచ్ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో కాక్రోచ్ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బి. బాపిరాజు మాట్లాడుతూ.. "సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం" అని అన్నారు.
రిస్కీ షూటింగ్ చేశాం
"ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. సహజమైన లొకేషన్స్‌లో రిస్కీ షూటింగ్ కానీ చేశాము. సెన్సార్ వారు మా మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని బి బాపిరాజు తెలిపారు.
"మా డైరెక్టర సునీల్ కుమార్ రెడ్డి గారు స్క్రిప్ట్ చెప్పినదానికంటే ఇంకా బాగా సినిమాను తెరకెక్కించారు. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుంది" అని నిర్మాత బి బాపిరాజు పేర్కొన్నారు.
జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్
డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించాను" అని అన్నారు.
"ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నాను. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయోలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను" అని సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
చిన్న చిన్న దొంగతనాలు చేసేవారిపై
"వేల కోట్ల రూపాయల మోసాలు చేసేవారిని వదిలేసే ఈ వ్యవస్థ, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి మీద ప్రతాపం చూపిస్తుంటుంది. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అడ్డు రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించాను" అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
"డార్క్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని పరిచయం చేసే చిత్రమిది. ఇలాంటి రియలెస్టిక్ సినిమాలు కూడా చూసి ఆదరించే ప్రేక్షకులు ఉంటారని నమ్ముతున్నాం. ఈ మూవీని డార్క్‌గా, ఓపెన్‌గా, బోల్డ్‌గా రూపొందించాం" అని చెప్పారు సునీల్ కుమార్ రెడ్డి.
వారు మాత్రం దూరంగా ఉండండి
"నేను చూసిన సమాజాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశాను. కేవలం వినోదం కోసం సినిమా చూసే వారికి మా మూవీ నచ్చకపోవచ్చు. కానీ మన సమాజంలో ఉన్న చేదు నిజాన్ని చూడాలనుకునేవారికి మా మూవీ తప్పకుండా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. చిన్న పిల్లలు , సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండమని మనవి చేస్తున్నాను " అని సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


