Monalisa: కుంభమేళ మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్..భర్తపై పోక్సో కేసు..మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ.. లవ్ జిహాద్!
Monalisa: కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
‘మహకుంభ్’ వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మోనాలిసా మైనర్ అని తేలడమే అందుకు కారణం. ఆమె ఏజ్ 18 ఏళ్ల కంటే తక్కువే అని తాజాగా నిర్ధారణ అయింది.

మోనాలిసా మైనర్
కుంభ మేళాలో తేనే కళ్లతో వైరల్ గా మారిన మోనాలిసా ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది లవ్ జిహాద్ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా మోనాలిసా మైనర్ అంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ చేపట్టింది. ఆమె మైనర్ అని కమిషన్ తేల్చింది.
16 ఏళ్ల 2 నెలలు
కమిషన్ విచారణలో మోనాలిసాకు పెళ్లి అయ్యే సమయానికి ఆమె ఏజ్ 16 ఏళ్ల, 2 నెలల, 12 రోజులు మాత్రమే అని తేలింది. ఆమె 2009 డిసెంబర్ 30న సాయంత్రం 5.50 గంటలకు జన్మించిందని ప్రభుత్వ వైద్య ఆసుపత్రి రికార్డుల ప్రకారం తెలిసింది. మార్చి 11, 2026 మోనాలిసా, ఫర్మాన్ పెళ్లి జరిగింది. అప్పటికీ ఆమె మైనరే.
తప్పుడు పుట్టిన తేదీ
మోనాలిసా తప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా పెళ్లి చేసుకుందని కమిషన్ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ మున్సిపాలిటీ ఆమెకు జారీ చేసిన డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందిన వాళ్లు కమిషన్ వెల్లడించింది.
పోక్సో కేసు
కమిషన్ ఆదేశాల మేరకు ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ లోని ఖర్ గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అంతే కాకుండా మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందిన యువతి కావడంతో బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టం కింద కూడా ఫర్మాన్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్రమ వివాహానికి చెందిన వివిధ సెక్షన్ల కింద కూడా చర్యలు తీసుకోబోతున్నారు.
మోనాలిసా పెళ్లి
మోనాలిసా మార్చి 11న కేరళలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లోని చరిత్రాత్మక అరుమానూర్ శ్రీ నైనార్ దేవాలయంలో ఈ మతాంతర వివాహం జరిగింది. ఈ వేడుకకు కేరళ మంత్రులు వి. శివన్‌కుట్టి, ఎం.వి. గోవిందన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.ఎ. రహీమ్ హాజరయ్యారు.
ఇండోర్ అమ్మాయి అయిన మోనాలిసా ఆరు నెలల క్రితం ఫర్మాన్ ఖాన్‌ను కలిసింది. అయితే, వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వారి కుటుంబాలు పెళ్లికి ఇష్టపడలేదు. దీంతో వీళ్లు పారిపోయి హిందూ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
లవ్ జిహాద్
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది లవ్ జిహాద్ అనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కానీ మోనాలిసానే తనకు ప్రపోజ్ చేసిందని, ఫస్ట్ రిజెక్ట్ చేసినా ఆ తర్వాత ప్రేమించానని ఫర్మాన్ చెప్పడం గమనార్హం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


