Monalisa Wedding: ఇది లవ్ జిహాద్.. ఆమెను గంగామాత అవతారంగా భావించా.. మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన పోస్ట్

Monalisa Wedding: కుంభమేళాతో పాపులర్ అయిన బ్యూటీ మోనాలిసా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ముస్లిం యువకుడిని ఆమె ప్రేమ పెళ్లి చేసింది. దీనిపై డైరెక్టర్ సనోజ్ శర్మ సంచలన కామెంట్లు చేశాడు. ఇది లవ్ జిహాద్ అంటూ ఆరోపించాడు. 

Published on: Mar 12, 2026, 12:34:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కుంభమేళాతో సెన్సేషన్ గా మారిన బ్యూటీ మోనాలిసా. తాజాగా ఆమె పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన లవర్ ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ పెళ్లి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా మోనాలిసాను హీరోయిన్ ను చేసిన డైరెక్టర్ సనోజ్ శర్మ సంచలన పోస్టు పెట్టాడు.

భర్తతో మోనాలిసా (PTI)
భర్తతో మోనాలిసా (PTI)

డైరెక్టర్ సంచలన పోస్టు

కుంభ మేళాతో పాపులర్ అయిన మోనాలిసా పెళ్లి చేసుకుంది. ఫర్మాన్ ఖాన్ ను బుధవారం (మార్చి 12) కేరళలో వివాహమాడింది. అయితే ఈ పెళ్లిపై సనోజ్ శర్మ సంచలన పోస్టు పెట్టాడు. ఇది లవ్ జిహాద్ అని అతను మండిపడ్డాడు. కుంభమేళాతో ట్రెండ్ అయిన మోనాలిసాను హీరోయిన్ గా పెట్టి ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాను సనోజ్ తీశాడు.

మానసిక ఆందోళన

‘‘మోనాలిసా మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ నేను మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. మహాకుంభమేళాలో వైరల్ అయిన తర్వాత, అడవుల్లో నివసించే ఒక పేద అమ్మాయి తన నివాసమైన డెరా మహేశ్వర్‌కు వెళ్ళిపోయింది. గంగమ్మ లాంటి ఆమె పవిత్రత, ప్రకృతి సిద్ధమైన ఆమె రూపం నాకు నచ్చాయి. ఆమెకు శిక్షణ ఇచ్చి, నా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నా’’ అని సనోజ్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో భారీ పోస్టు రాసుకొచ్చాడు.

జైలుకు పంపారు

‘‘మోనాలిసాతో సినిమా అనగానే దేశమంతా హర్షం వ్యక్తం చేసింది. కానీ మా ప్రత్యర్థులైన వసీం రిజ్వీకి, మీడియాలో పబ్లిసిటీ కోసం ఆరాటపడే వారికి ఇది నచ్చలేదు. నన్ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహా కుంభమేళాను విఫలం చేయడమే వారి ప్రధాన ఉద్దేశ్యం’’ అని సనోజ్ పేర్కొన్నాడు.

గంగామాత అవతారం

‘‘నేను జైలులో ఉండి సినిమా కథ రాశా. ‘సనోజ్ ఇక ఎప్పటికీ సినిమా తీయలేడు’ అన్న వారి నోళ్లు మూయించేలా సినిమా పూర్తి చేశా. ఆ తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారికి మిగిలిన ఒకే ఒక అవకాశం 'మోనాలిసా'. నేను ఆమెను గంగామాత అవతారంగా భావించా’’ అని సనోజ్ శర్మ తెలిపాడు.

లవ్ జిహాద్

‘‘మోనాలిసా తన బాధను నాతో చెప్పుకుంటూ ఏడ్చేది. ఎప్పటికైనా అందరినీ ఎదిరించి తన తల్లి దగ్గరకు వెళ్తానని అనేది. నేను ఆమెకు సర్దిచెప్పేవాడిని. కానీ ఇస్లామిక్ శక్తులు నన్ను రేపిస్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో ఆమె వ్యక్తిగత విషయాల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోలేదు.

‘‘మోనాలిసా వేసిన ఈ అడుగు ఆమెకు తిరుగుబాటులా అనిపించవచ్చు. కానీ, నిజానికి ఇది 'లవ్ జిహాద్'. ఆమె ఇందులో చిక్కుకుపోయింది. నా దగ్గర జీతం తీసుకుంటూ ఆమెకు చదువు చెప్పడానికి నియమితుడైన ఓ వ్యక్తి ఇప్పుడు ఆమెకు మేనేజర్ గా మారిపోయాడు’’ అని సనోజ్ శర్మ సంచలన పోస్టు పెట్టాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More