...
...
Next Story

RAPO23: రాపో23 నుంచి కిరాక్ అప్డేట్.. రామ్ పోతినేనిని ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్ గా బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలిస్తే షాక్!

RAPO23: రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న రాపో23 (వర్కింగ్ టైటిల్) నుంచి కిరాక్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ పోతినేనిని ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ ఎవరో తెలిసిపోయింది. బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్‌ముఖ్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

Published on: Oct 19, 2026, 12:02:22 IST
Advertisement

RAPO23: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #RAPO23. రామ్ తన కెరీర్‌లో మొదటిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా ఒక టాప్ బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇచ్చారు.

రామ్‌కు విలన్‌గా రితేష్ దేశ్‌ముఖ్

రాపో23 నుంచి కిరాక్ అప్డేట్.. రామ్ పోతినేనిని ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్ గా బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలిస్తే షాక్!
రాపో23 నుంచి కిరాక్ అప్డేట్.. రామ్ పోతినేనిని ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్ గా బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలిస్తే షాక్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ (Ritesh Deshmukh) ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారు. హీరోగా, విలన్‌గా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన రితేష్.. ఈ చిత్రంలో చాలా పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. తాజాగా రితేష్ దేశ్‌ముఖ్, హీరో రామ్, ఇతర ప్రధాన నటీనటులపై కీలకమైన సీన్లను చిత్రీకరించడానికి ఒక కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు.

పవర్‌ఫుల్ విలన్

బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్‌ముఖ్ హీరోనే కాదు పవర్‌ఫుల్ విలన్ కూడా. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో హీరోగా మెప్పించిన అతను.. నెగెటివ్ రోల్స్ లోనూ అదరగొట్టాడు. ఏక్ విలన్ సినిమాలో సైకో కిల్లర్ గా రితేష్ విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు రాపో23 మూవీతో అతను టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

ఆల్ రౌండర్

రాపో23 సినిమాతో రామ్ పోతినేని కేవలం యాక్టింగ్, డైరెక్షన్‌కే పరిమితం కాకుండా.. తానే స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ రచయితగా కూడా ఆల్ రౌండర్ రోల్ పోషిస్తున్నారు. రామ్ పక్కా ప్లానింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటంతో సినిమా అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వస్తోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

క్రేజీ కాస్ట్ అండ్ క్రూ

• హీరో & డైరెక్టర్: రామ్ పోతినేని

• హీరోయిన్: సంయుక్త (Samyuktha)

• విలన్: రితేష్ దేశ్‌ముఖ్

• సంగీతం: శ్యామ్ సీఎస్ (Sam CS) తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టనున్నారు.

• నిర్మాత: రాపో సినిమాటిక్స్ (Rapo Cinematics) బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

రామ్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటం, దానికి తోడు రితేష్ దేశ్‌ముఖ్ లాంటి బాలీవుడ్ స్టార్ విలన్‌గా తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడే స్కై హైకి చేరిపోయాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks