Bigg Boss 10 Fight: ఏందీ రచ్చ.. ఆ బూతులేంది.. కొట్టుకోవడం ఏంది.. బిగ్ బాస్ హౌస్‌లో అమన్, త్రిగుణ్ ఫైట్.. ఫ్యాన్స్ షాక్
Bigg Boss 10 Fight: బిగ్ బాస్ హౌస్ లో అమన్, త్రిగుణ్ మధ్య జరిగిన ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది. బూతులు, ఫిజికల్ ఫైట్లతో వాతావరణం వేడెక్కడంపై ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. అమన్ కు రెడ్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Bigg Boss 10 Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఊహించని దారుణం జరిగింది. నామినేషన్స్ వేడి తగ్గుముఖం పట్టకముందే కంటెస్టెంట్లు అమన్ మసూద్ (Aman Masud), త్రిగుణ్ (Thrigun) మధ్య జరిగిన తీవ్రమైన గొడవ హౌస్‌లో ఫిజికల్ ఎటాక్ వరకు వెళ్లింది. అసభ్యకర పదం వాడాడనే ఆరోపణలతో అమన్.. త్రిగున్‌పై చెయ్యి చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.

కెప్టెన్సీ టాస్క్‌లో చెలరేగిన రచ్చ.. మణికట్టు పట్టుకుని నలిపేసిన అమన్
ఈ వారంలో అపూర్వ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించి ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ గేమ్ ఆడుతున్న సమయంలో అమన్.. త్రిగుణ్ మణికట్టును చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. నొప్పితో అరిచిన త్రిగున్.. అమన్ పదే పదే అలాగే చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
వెంటనే పైకి లేచి అమన్ ముఖం ముందుకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అమన్.. త్రిగుణ్ ను గట్టిగా వెనక్కి తోసేయడంతో గొడవ ఫిజికల్ ఫైట్‌గా మారింది. మిగతా హౌస్‌మేట్స్ వచ్చి ఇద్దరినీ పట్టుకుని పక్కకు లాగాల్సి వచ్చింది.
'లం.. వర్డ్' ఆరోపణలు.. ఏడ్చేసిన అమన్
గొడవ ముదురుతున్న సమయంలో త్రిగుణ్ తనను ఉద్దేశించి ఒక అత్యంత అసభ్యకరమైన పదాన్ని (లం.. పదం) వాడాడని అమన్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. త్రిగుణ్ ను 'చీప్' అని పిలుస్తూ అతని వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అమన్ ఆవేశం కంట్రోల్ కాకపోవడంతో మిగతా కంటెస్టెంట్లు అతని నోటిపై చేతులు పెట్టి ఆపాల్సి వచ్చింది.
మరోవైపు త్రిగుణ్ తన మణికట్టు చూపిస్తూ అమన్ తనను దారుణంగా గాయపరిచాడని వాపోయాడు. కెప్టెన్ అపూర్వ వచ్చి త్రిగుణ్ ను ప్రశ్నించగా, "నువ్వు ఆ మాట నా నోటి నుంచి విన్నావా? ఎవరి మాటలో విని నన్ను ఎలా నిందిస్తావ్?" అంటూ ఆమెపై కూడా త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. అసలు ఆధారాలే లేకుండా తనపై అంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారని నిలదీశాడు.
నెటిజన్ల షాక్.. అమన్‌కి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందేనా?
ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే ఎక్స్ లో ఈ ఫైట్ క్లిప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం హౌస్‌లో ఫిజికల్ వైలెన్స్ లేదా అత్యంత బూతు పదాలు వాడితే నేరుగా 'రెడ్ కార్డ్' ఇచ్చి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది.
అమన్ అంత దారుణంగా చెయ్యి చేసుకోవడం తప్పు అని, అతనికి ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. త్రిగుణ్ కావాలనే బూతులు తిట్టి అమన్‌ను రెచ్చగొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా యాజమాన్యం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆడియెన్స్ కోరుతున్నారు.
కింగ్ నాగార్జున వీకెండ్ క్లాస్.. బిగ్ బాస్ ఏం చేయబోతున్నారు?
శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్రిగుణ్ నిజంగానే ఆ అసభ్యకర పదాన్ని వాడాడా లేదా అనేది ఫుటేజ్ చెక్ చేసి నాగ్ తేల్చనున్నారు.
ఒకవేళ అమన్ చేసిన ఫిజికల్ ఎటాక్ లేదా త్రిగుణ్ వాడిన బూతులు నిరూపణ అయితే ఈ వారంలో ఊహించని ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9:00 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ఈ ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి. అలాగే జియోహాట్‌స్టార్ (JioHotstar) లో కూడా వీటిని డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


