...
...
Next Story

Bigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు స్టేజీపై నుంచే ఎలిమినేషన్.. హౌస్ లో ట్విస్టులు!

Bigg Boss 10: బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ కానుంది. లాంఛింగ్ రోజే అదిరే ట్విస్ట్ లు ఆడియన్స్ కు షాక్ ఇవ్వనున్నాయి. లేటెస్ట్ ప్రోమోతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

Published on: Sep 6, 2026, 16:22:43 IST
Advertisement

Bigg Boss 10: ఫస్ట్ రోజే ట్విస్ట్ లు, అదిరే టాస్క్ లు, షాకింగ్ ఎలిమినేషన్.. ఇదీ బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్ ఇవ్వబోతున్న కిక్. అవును.. ఇవాళ (సెప్టెంబర్ 6) స్టార్ట్ కానున్న బిగ్ బాస్ 10 లాంఛ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉండనుంది. తాజాగా రిలీజైన ప్రోమో వేరే లెవల్ లో ఉంది.

బిగ్ బాస్ 10 తెలుగు

Bigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు స్టేజీపై నుంచే ఎలిమినేషన్.. హౌస్ లో ట్విస్టులు! (youtube/starmaa)
Bigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు స్టేజీపై నుంచే ఎలిమినేషన్.. హౌస్ లో ట్విస్టులు! (youtube/starmaa)

తెలుగు టీవీ ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న బిగ్ టైమ్ రాబోతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఈ రోజు స్టార్ట్ అవుతోంది. సాయంత్రం 7 గంటలకు లాంఛ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ లాంఛ్ ఎపిసోడ్ లోనే అదిరే ట్విస్ట్ లను మేకర్స్ ప్లాన్ చేశారు.

రాగానే టాస్క్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఆదివారం ప్రారంభమవుతోంది. మరోసారి హోస్ట్ గా నాగార్జున అదరగొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే హౌస్ లోకి రాగానే కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు మేకర్స్. 10వ సీజన్ కాబట్టి పది పవర్స్ ను కంటెస్టెంట్ల కోసం సెట్ చేశారు మేకర్స్. ఆ పవర్ బాక్స్ లను సొంతం చేసుకోవాలంటే కీస్ గెలుచుకోవాలి.

సింగర్ ఝాన్సీ

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో విన్నర్ గా నిలిచిన సింగర్ ఝాన్సీ అఫీషియల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె టాస్క్ లోనూ తనదైన స్టైల్ లో అదరగొట్టింది. ఇక హౌస్ లోకి సీరియల్ స్టార్స్, జబర్దస్త్ కమెడియన్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లు అడుగుపెట్టినట్లు తెలిసింది.

షాకింగ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం రెడీ చేసిన హౌస్ డిఫరెంట్ గా, దశావతారం కాన్సెస్ట్ కు తగ్గట్లుగా ఉంది. ఇక హౌస్ లోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే ఓ రోబో వెల్ కమ్ చెప్పడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది. ఈ లాంఛ్ ఎపిసోడ్ కు కార్తి, ఎస్ జే సూర్య గెస్ట్ లుగా వచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe