Bigg Boss 10: బిగ్ బాస్ 10లో ట్విస్టులే ట్విస్టులు.. కెప్టెన్సీని డిసైడ్ చేసేది ఆడియ‌న్సే.. ప‌వ‌ర్ ఆఫ్ పీపుల్‌!

Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత 9 సీజన్లకు భిన్నంగా ఈ సారి అంతా డిఫరెంట్ గా సాగుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్సీని డిసైడ్ చేసే పవర్ ను ఆడియన్స్ కు ఇచ్చారు. ఇంకా కొత్తగా ఏం చేయబోతున్నారో చూడాలి. 

Published on: Sep 14, 2026, 05:34:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైల్ స్టోన్ లాంటి పదో సీజన్ ఆడియన్స్ కు వరుసగా ట్విస్టులు ఇస్తుంది. జనరల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టి ప్రతి వారం కెప్టెన్ ను సెలక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ 10 సెకండ్ వీక్ లో మాత్రం ఆ పవర్ ను జనాలకు ఇచ్చారు.

బిగ్ బాస్ 10లో ట్విస్టులే ట్విస్టులు.. కెప్టెన్సీని డిసైడ్ చేసేది ఆడియ‌న్సే.. ప‌వ‌ర్ ఆఫ్ పీపుల్‌! (x/starmaa)
బిగ్ బాస్ 10లో ట్విస్టులే ట్విస్టులు.. కెప్టెన్సీని డిసైడ్ చేసేది ఆడియ‌న్సే.. ప‌వ‌ర్ ఆఫ్ పీపుల్‌! (x/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు

ఆటలో సవాలు కాదు ఆటే సవాలంటూ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ వీక్ మహా పరీక్ష పెట్టారు. కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్లు హౌస్ మేట్స్ గా మారేందుకు టాస్కులు పెట్టారు. ఇక మిడ్ వీక్ లోనే ఇద్దరి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ మామూలు షాక్ ఇవ్వలేదు. వీకెండ్ లో మాత్రం నో ఎలిమినేషన్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.

పవర్ ఆఫ్ పీపుల్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ప్రతి వారం ఆటను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కావడానికి మహా పరీక్ష నిర్వహించారు. ఇక సెకండ్ వీక్ అంతా ఆడియన్స్ చేతుల్లోనే ఉందని హోస్ట్ నాగార్జున చెప్పారు. ‘పవర్ ఆఫ్ పీపుల్’ అంటూ కాన్సెప్ట్ పరిచయం చేశారు. బిగ్ బాస్ 10 తెలుగులో సెకండ్ వీక్ కెప్టెన్ ను ఎంచుకొనే అవకాశాన్ని జనాలకు ఇచ్చారు.

ఏం చేయాలంటే?

పవర్ ఆఫ్ పీపుల్ కాన్సెప్ట్ లో భాగంగా బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్ గా చూడాలనుకుంటున్న కంటెండర్ ను జనాలు సెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. ఈ 14 మంది కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్నారు. వీళ్లలో తమకు నచ్చిన కంటెస్టెంట్ కు జనాలు మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేయొచ్చు. ఓట్లు ఎక్కువ వచ్చిన హౌస్ మేట్స్ మధ్య కెప్టెన్సీ కోసం ఫైట్ జరుగుతుంది.

ఎప్పటివరకు?

బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్సీ కంటెండర్స్ ను డిసైడ్ చేయడం కోసం ఆడియన్స్ ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటింగ్ లైన్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇవాళ (సెప్టెంబర్ 14) మధ్యాహ్నం 12 గంటల వరకే ఇవి ఓపెన్ గా ఉంటాయి. ఆ తర్వాత ఓటింగ్ వేయలేరు. అందుకే వెంటనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టేందుకు ట్రై చేసేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More