ఇటీవలే ముగిసిన హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' (Bigg Boss 19) కంటెస్టెంట్లు దుబాయ్‌లో వాలిపోయారు. షో గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో విన్నర్ గౌరవ్ ఖన్నా, ఫైనలిస్టులు, ఇతర కంటెస్టెంట్లు సందడి చేశారు. అయితే వీరంతా పార్టీ వేదికకు వెళ్లేందుకు ఒక బస్సులో ప్రయాణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల సక్సెస్ పార్టీ

బిగ్ బాస్ 19 షో ముగిశాక అందరూ కలిసి ఇలా చిల్ అవ్వడం ఫ్యాన్స్‌కి నచ్చినా.. అందరూ కలిసి బస్సులో వెళ్లడాన్ని చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దుబాయ్ పార్టీకి వెళ్లే క్రమంలో కంటెస్టెంట్లందరూ ఒకే బస్సులో కిక్కిరిసి ప్రయాణించారు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
"అంబానీ పెళ్లిలో బాలీవుడ్ స్టార్లే బస్సుల్లో వెళ్లారు.. వీళ్లెంత?" అని ఒకరు సెటైర్ వేయగా.. సల్మాన్ ఖాన్ సినిమా ‘హమ్ సాత్ సాత్ హై’లో ఫ్యామిలీ అంతా బస్సులో వెళ్లే సీన్ గుర్తొస్తోందని, ఆ సినిమాలోని "ఏబీసీడీ" పాటను గుర్తుచేసుకుంటున్నారు. "తాన్యా మిట్టల్ మాత్రం రోల్స్ రాయిస్‌లో సోలోగా ఎంట్రీ ఇస్తుంది చూడండి" అంటూ ఇంకొకరు జోక్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా స్టార్ ఆవేజ్ దర్బార్ "ఏబీసీడీఈఎఫ్.." అంటూ పాట పాడటం వీడియోలో హైలైట్.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల పార్టీ విశేషాలు
దనూబే గ్రూప్ (Danube Group) ఫౌండర్ రిజ్వాన్ సాజన్ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ల కోసం ఈ పార్టీని దుబాయ్‌లో ఘనంగా ఏర్పాటు చేశారు. దీనికి విన్నర్ గౌరవ్ ఖన్నా, ఫర్హానా భట్, తాన్యా మిట్టల్, ప్రణీత్ మోర్, అష్నూర్ కౌర్, బషీర్ అలీ, ఆవేజ్ దర్బార్, నేహాల్ చుడాసమా, అభిషేక్ బజాజ్, కునికా సదానంద్, మృదుల్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
బిగ్ బాస్ 19 రికార్డులు
గతేడాది డిసెంబర్ 7న ముగిసిన బిగ్ బాస్ 19 సీజన్ రికార్డు స్థాయి వ్యూవర్షిప్ సాధించింది. టీవీ నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచాచింది.
{{/usCountry}}గతేడాది డిసెంబర్ 7న ముగిసిన బిగ్ బాస్ 19 సీజన్ రికార్డు స్థాయి వ్యూవర్షిప్ సాధించింది. టీవీ నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచాచింది.
{{/usCountry}}ఓటీటీలో ప్రసారమైన నాన్-ఫిక్షన్ షోలలో ఇదే టాప్. ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం.. ఫినాలే వారంలో ఏకంగా 7.2 మిలియన్ల మంది ఈ షోను చూశారు. సగటున వారానికి 8 మిలియన్ల వ్యూస్ తో ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యింది.