టాస్క్‌ల్లో ఇర‌గ‌దీస్తున్న ఇమ్మాన్యుయెల్‌-సెకండ్ ఫైన‌లిస్ట్ టికెట్‌-ఎలిమినేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా హీరోయిన్‌!

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ దిశగా సాగుతోంది. హౌస్ లో ఇది కాకుండా మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్ లో చోటు కోసం కంటెస్టెంట్లు తీవ్రంగా పోరాడుతున్నారు. టాస్క్ ల్లో మాత్రం ఇమ్ము అదరగొడుతున్నాడు. 

Published on: Dec 9, 2025, 13:47:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫైనలిస్ట్ లో ఒకరిగా అంచనాలు పెంచేస్తున్న ఇమ్మాన్యుయెల్ ఆ దిశగా అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. ఈ సీజన్ లో సెకండ్ ఫైనలిస్ట్ అతనే అని సమాచారం. ఈ వారం టాస్క్ ల్లో అదరగొట్టిన ఇమ్మాన్యుయేల్ సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సంజన డేంజర్ జోన్లో ఉందని తెలిసింది.

బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయెల్ (youtube)
బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయెల్ (youtube)

బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ముగింపునకు చేరుకుంటుంది. ఇది కాకుండా, మరో వారం మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో మొత్తం 7 మంది ఉన్నారు. వీళ్లలో పడాల కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ చేరాడు. ఇక మిగిలింది ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్. వీళ్లలో సెకండ్ ఫైనలిస్ట్ టికెట్ ను ఇమ్మాన్యుయెల్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.

టాస్క్ ల్లో అదుర్స్

ఈ వారం బిగ్ బాస్ లో నామినేషన్ తప్పించుకోవడానికి ఇమ్యునిటీ కావాలంటే టాస్క్ ల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి పాయింట్లు సంపాదించుకోవాల్సిందే. దీనికి తగ్గట్లుగా బిగ్ బాస్ టాస్క్ లు పెడుతున్నాడు. అలాగే కంటెస్టెంట్ల మధ్య పాయింట్ల కోసం గొడవలూ జరిగాయి. ఈ టాస్క్ ల్లో ఇమ్మాన్యుయెల్ అదరగొడుతున్నాడు. అందరికంటే బెటర్ గా ఆడుతున్నాడు. ఈ పరంగా చూసుకుంటే అతను పాయింట్లలో అందరి కంటే ముందు వరుసలో ఉన్నాడు.

డేంజర్ జోన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టాప్-5 కాకుండా టాప్-6 ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఎలా అయినా ఈ వారం కనీసం ఒకరైనా హాస్ నుంచి ఎలిమినేట్ కావాలి. ఈ రకంగా చూసుకుంటే ప్రస్తుతం సంజన గల్రానీ డేంజర్ జోన్లో ఉంది. ఆమె టాస్క్ ల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆడే అవకాశం వచ్చినా ఉత్తమ ప్రదర్శన మాత్రం చేయలేకపోతుంది. ఆమె పాయింట్లు సున్నాగా ఉన్నాయి.

భరణి కోరిక

మరోవైపు భరణి శంకర్ కెప్టెన్సీ కోరికను బిగ్ బాస్ తీర్చాడు. ఈ వారం కెప్టెన్ ను చేశాడు. అయితే మిగిలిన వాళ్లలో చూసుకుంటే తనూజాకు ఓటు బలం ఎక్కువగా ఉంది. మొదటి నుంచి ఇది చూస్తున్నదే. ఇక డీమాన్ పవన్, సుమన్ శెట్టి కూడా టాస్క్ లు బాగా ఆడుతున్నారు. మిగిలింది సంజన మాత్రమే. అందుకే ఈ వారం హౌస్ నుంచి సంజన వెళ్లిపోయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More